Breaking News

ఢిల్లీలో కాంగ్రెస్‌ లోక్‌సభ అభ్యర్థులెవరు?

Published on Wed, 03/06/2024 - 10:56

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తున్నాయి. బీజేపీ 195 మంది అభ్యర్థుల పేర్లను వెల్లడించగా, కాంగ్రెస్ కూడా త్వరలో ఈ జాబితాను విడుదల చేయనుంది. 

మీడియాకు అందిన వివరాల ప్రకారం ఢిల్లీలోని చాందినీ చౌక్, నార్త్-వెస్ట్, ఈశాన్య సీట్ల కోసం పార్టీ పలువురి పేర్లను చర్చిస్తోంది. కాంగ్రెస్, ఆప్ మధ్య పొత్తు కుదిరిన నేపధ్యంలో ఢిల్లీలోని ఏడు స్థానాలలోని మూడు స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుంది. ఈ సీట్లలో పోటీకి నిలబెట్టేందుకు కొన్ని కొత్త పేర్లతో పాటు పాత అభ్యర్థులు, కులాల సమీకరణకు తగిన అభ్యర్థులు ఎవరనే అంశంపై కాంగ్రెస్‌లో చర్చ జరుగుతోంది. 

ఇందుకోసం కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ పలు సమావేశాలు నిర్వహించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.  చాందినీ చౌక్ నుంచి అభ్యర్థిత్వం కోసం భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లాంబా, మాజీ ఎమ్మెల్యే హరిశంకర్ గుప్తా, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్ పోటీలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. 

అలాగే ఈశాన్య ఢిల్లీ స్థానం నుంచి కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్ లవ్లీ, ఢిల్లీ కాంగ్రెస్ మాజీ చీఫ్ చౌదరి అనిల్ కుమార్, ఢిల్లీ సీనియర్ నేత ఛత్తర్ సింగ్ పోటీదారులుగా ఉన్నట్లు తెలుస్తోంది. జేఎన్‌యూఎస్‌యూ మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ కూడా ఈ రేసులో ఉన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. 

నార్త్-వెస్ట్ ఢిల్లీకి కేంద్ర మాజీ మంత్రి కృష్ణ తీరథ్, ఢిల్లీ మాజీ మంత్రి రాజ్ కుమార్ చౌహాన్, మాజీ ఎంపీ ఉదిత్ రాజ్, బవానా మాజీ ఎమ్మెల్యే సురేంద్ర కుమార్ పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ఈ జాబితాను ఇంకా విడుదల చేయలేదు. ఈ మూడు స్థానాల్లో బీజేపీకి గట్టి పోటీ ఇచ్చేవారిని ఎంపిక చేయాలని కాంగ్రెస్‌ యోచిస్తోంది. 

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)