Breaking News

రవాణా మంత్రినే బస్సు దింపేసిన కండక్టర్

Published on Sun, 07/12/2026 - 11:12

బెంగళూరు నగర బస్సు ప్రయాణికులు నిత్యం ఎదుర్కొనే సమస్యలు ఎలా ఉంటాయో.. కర్ణాటక రవాణా శాఖ మంత్రి బైరతి సురేష్ స్వయంగా అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. శనివారం రాత్రి ఆయన మాస్క్ ధరించి సాధారణ ప్రయాణికుడిగా తనిఖీ నిర్వహించారు. అడిగినంత చిల్లర ఇవ్వలేకపోయినందుకు మంత్రిని బస్సు దిగిపోవాలంటూ బీఎంటీసీ బస్సు కండక్టర్ కోరడంతో ఆయన షాక్‌ అయ్యారు.

బస్సుల్లో తనిఖీకి మంత్రి బైరతి సురేష్ బయలుదేరారు. హెబ్బాళ్ నుంచి నాగశెట్టిహళ్లికి వెళ్లే బీఎంటీసీ బస్సు ఆయన ఎక్కారు. మాస్క్ ధరించిన మంత్రి.. రాత్రి 7:10 గంటల నుండి 9:10 గంటల మధ్య జయమహల్, టీవీ టవర్, ఆర్‌టీ నగర్, సీబీఐ రోడ్, హెబ్బాల్, మాన్యతా టెక్ పార్క్, నాగవార, హెన్నూర్, హెన్నూర్ బండే, బైరతి బండే, గెద్దలహళ్లి రూట్లలో బస్సుల్లో ప్రయాణించి తనిఖీలు చేపట్టారు.

ఈ క్రమంలో రెండు టిక్కెట్లు కావాలని కోరుతూ మంత్రి రూ.100 నోటు ఇచ్చారు. మంత్రిని గుర్తించని కండక్టర్.. చిల్లర ఇవ్వాలని కోరాడు. తన వద్ద చిల్లర లేదని మంత్రి చెప్పగా.. తన వద్ద కూడా చిల్లర లేదని చెబుతూ కండక్టర్ తన బ్యాగ్ తెరిచి చూపించాడు. చిల్లర ఇవ్వలేకపోతే బస్సు దిగాల్సిందేనని కండక్టర్ పట్టుబట్టాడు. దీంతో మంత్రి ఎలాంటి సమాధానం చెప్పకుండానే బస్సు దిగిపోయారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాధారణ ప్రజల మాదిరిగా మంత్రి మారు వేషంతో తనిఖీకి వెళ్లడంపై సోషల్‌ మీడియాలో ఈ ఘటన వైరల్‌గా మారింది. మంత్రిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)