సన్‌బర్న్‌ షోలో ‘శివుడి ఫొటో’.. నిర్వాహకులపై ఫిర్యాదు

Published on Sun, 12/31/2023 - 07:43

గోవాలో నిర్వహించిన సన్‌బర్న్‌ కార్యక్రమంలో చోటు చేసుకున్న  ఓ విషయంపై  కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలు ఆగ్రహించారు. అక్కడితో ఆగకుండా కార్యక్రమ నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు రోజులపాటు జరిగిన సన్‌బర్న్‌ ఎలక్ట్రానిక్‌ డీజే షోలో భాగంగా డిజటల్‌ స్క్రీన్‌పై శివుడి ఫొటో ప్రదర్శించడం వివాదం రేపింది. ఈ ఘటనను కాంగ్రెస్‌ నేత విజయ్‌ బైకే తీవ్రగా ఖండించారు.  దీనిపై ఆయన  శుక్రవారం గోవాలోని మాపూసా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. షో నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ ఘటనపై స్పందించిన గోవా ఆప్ అధ్యక్షుడు అమిత్‌ పాలేఖర్‌.. సనాతన ధర్మాన్ని అవమానించిన సన్‌ బర్న్‌ డీజే షో నిర్వాహకులపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రెండు రోజుల పాటు గోవాలోని వాగ్‌తోర్‌లో జరిగిన ఈ షోలో.. అందరూ మద్యం తాగుతూ, డ్యాన్స్‌లు చేస్తున్న సమయంలో అక్కడి  డిజిటల్‌ స్క్రీన్‌పై  శివుడి ఫొటో ప్రదర్శించారని అన్నారు. సనాతన ధర్మాన్ని అవమాన పరిచిన షో నిర్వాహకులపై చర్యలు తీసుకునే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని అన్నారు.

విజయ్‌ బైకే మాట్లాడుతూ.. ఉద్దేశపూరితంగా తాగుతూ, డ్యాన్స్‌లు చేస్తున్న సమయంలో షో నిర్వాహకులు శివుడి ఫొటో  స్క్రీన్‌పై వేశారని అన్నారు. ఇలాంటి చర్యలలో హిందూవుల మనోభావాలను కించపరిచినట్లు అవుతుందని మండిపడ్డారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు అధికారులు చర్యలు తీసుకుంటామని తెలిపారని చెప్పారు.

చదవండి: NEW YEAR 2024: న్యూ ఇయర్‌ దశకం

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)