Breaking News

ఊరట.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర

Published on Wed, 07/01/2026 - 07:33

పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో వరుసగా పెరుగుతూ వచ్చిన కమర్షియల్‌ ఎల్పీజీ సిలిండర్‌ ధరలకు కేంద్ర ప్రభుత్వం ఊరట కలిగించింది. తాజాగా ఒక్కో 19 కేజీల కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌పై రూ.183 మేర తగ్గింపు ప్రకటించింది. జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిర్ణయంతో హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్‌ సంస్థలు, చిన్న వ్యాపారులకు కొంత ఉపశమనం లభించింది.

ఇటీవల ఇరాన్‌–ఇజ్రాయెల్‌ యుద్ధ ఉద్రిక్తతలు, పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ ఎల్పీజీ సరఫరా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో గత కొన్ని నెలలుగా కమర్షియల్‌ గ్యాస్‌ ధరలు వరుసగా పెరిగాయి. మే నెలలో భారీ పెంపు నమోదు కాగా, జూన్‌లోనూ మరోసారి ధరలు పెరగడంతో వ్యాపార రంగంపై అదనపు భారం పడింది.

తాజాగా పరిస్థితులు కొంత మెరుగుపడటంతో కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో ఇప్పటి వరకు రూ.3,113.50గా ఉన్న 19 కేజీల కమర్షియల్‌ సిలిండర్‌ ధర ఇప్పుడు రూ.2,930కు తగ్గింది. దేశవ్యాప్తంగా ఇదే తరహాలో ధరల సవరణ అమలులోకి వచ్చింది.

పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం.. దేశీయ ఉత్పత్తి మెరుగుపడటం, దిగుమతి ఎల్పీజీ కార్గోల రాక ప్రారంభం కావడంతో సరఫరా పరిస్థితులు స్థిరపడుతున్నాయి. దీంతో గతంలో విధించిన కమర్షియల్‌ ఎల్పీజీ సరఫరా పరిమితులను పూర్తిగా తొలగించి, యుద్ధానికి ముందు స్థాయికి సరఫరాను పునరుద్ధరించినట్లు తెలిపింది.

సంక్షోభ సమయంలో భారీగా ప్రభావితమైన సరఫరా వ్యవస్థను క్రమంగా పునరుద్ధరించేందుకు ప్రభుత్వం దశలవారీ చర్యలు తీసుకుంది. ప్రారంభంలో 50 శాతం స్థాయికి పడిపోయిన బల్క్‌ ఎల్పీజీ సరఫరా ఇప్పుడు మళ్లీ 70 శాతం వరకు చేరిందని అధికారులు తెలిపారు. అలాగే రిఫైనరీలను ఎక్కువగా ఎల్పీజీ ఉత్పత్తికి మళ్లించడం ద్వారా దేశీయ సరఫరాను పెంచారు.

ఈ తగ్గింపు కేవలం కమర్షియల్‌ వినియోగానికి మాత్రమే వర్తిస్తుంది. గృహ వినియోగం కోసం ఉపయోగించే 14.2 కేజీల సిలిండర్‌ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం దేశీయ ఎల్పీజీ ఉత్పత్తిని రోజుకు 40,000 టన్నుల కంటే ఎక్కువగా నిలబెట్టేలా చర్యలు కొనసాగుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ప్రధాన నగరాల్లో తాజా కమర్షియల్‌ సిలిండర్‌ ధరలు ఇలా ఉన్నాయి:

* ఢిల్లీ: రూ.2,930
* హైదరాబాద్‌: రూ.3,178
* విజయవాడ: రూ.3,115

ధర తగ్గింపు నేపథ్యంలో హోటల్‌, రెస్టారెంట్‌ రంగాలకు కొంత ఊరట లభించినప్పటికీ, గత నెలల పెంపుల ప్రభావం ఇంకా కొనసాగుతుందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)