Breaking News

ఢిల్లీలో మరింతగా పెరిగిన చలి.. మిగిలిన రాష్ట్రాల్లో..

Published on Tue, 11/26/2024 - 07:35

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీతో పాటు ఉత్తర భారతదేశం అంతటా చలి వాతావరణం నెలకొంది. ఉదయం, సాయంత్రం వేళల్లో ఉష్ణోగ్రతల్లో భారీ తగ్గుదల కనిపిస్తోంది. ఢిల్లీలో కాలుష్యం కారణంగా అక్కడి ప్రజలకు స్వచ్ఛమైన గాలి అందడం లేదు. మరోవైపు కొండ ప్రాంతాల్లో మంచు కురుస్తోంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా  వేసింది.

ఈరోజు(మంగళవారం) ఉదయం ఢిల్లీలో అంతటా పొగమంచు కమ్మేసింది. గరిష్ట ఉష్ణోగ్రత 26, కనిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్‌గా ఉండే అవకాశాలున్నాయి. నవంబర్ 27 నుండి డిసెంబర్ ఒకటి వరకు ఏర్పడే వాతావరణం  విషయానికి వస్తే గరిష్ట ఉష్ణోగ్రత 25, కనిష్టంగా 10 డిగ్రీల వరకు ఉండవచ్చు. నవంబర్ 28, 29 తేదీలలో పొగమంచు కమ్మేయనున్న దృష్ట్యా  ఎల్లో అలర్ట్‌ జారీచేశారు. అ సమయంలో వర్షాలు కురిసే అవకాశం కూడా లేదు.

ఢిల్లీకి ఆనుకుని ఉన్న పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో కూడా చలి మొదలైంది. నవంబర్ 27, 28, 29 తేదీలలో ఉదయం వేళ పొగమంచు కమ్మేయనుంది. చండీగఢ్‌లో ఫాగ్ అలర్ట్ ఉంది. ఈ రోజు హర్యానాలో గరిష్ట ఉష్ణోగ్రత 26-27 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 11-12 డిగ్రీల సెల్సియస్‌గా ఉండనుంది. పంజాబ్‌లో ఈరోజు గరిష్ట ఉష్ణోగ్రత 25-26 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 10-11 డిగ్రీల మధ్య ఉండనుంది.

జమ్మూ కాశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రత -2 నుండి -3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతోంది. ఈరోజు జమ్మూలో కనిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీలుగా ఉంది.  ఈ పరిస్థితి నవంబర్ 29 వరకు కొనసాగనుంది. రాజస్థాన్‌లో కూడా చలి  అధికంగానే ఉంది. ఉత్తరప్రదేశ్‌లో పొగమంచు కురిసే అవకాశం ఉంది. 

ఇది కూడా చదవండి: 11 గంటలు లేటుగా వందేభారత్‌.. ప్రయాణికుల ఆందోళన

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)