Breaking News

ఎయిర్ ఇండియా విమానంలో.. ‘దురదృష్టవశాత్తూ’ బొద్దింకలు

Published on Mon, 08/04/2025 - 13:10

న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానాలు ఏదో కారణంగా తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా శాన్ ఫ్రాన్సిస్కో నుండి కోల్‌కతా మీదుగా ముంబైకి నడిచే ఎయిర్ ఇండియా విమానం ఏI180లో  చిన్న చిన్న బొద్దింకలు కనిపించాయని  ఇద్దరు ప్రయాణికులు ఫిర్యాదు చేసిన దరిమిలా వాటిని తొలగించినట్లు ఎయిర్‌లైన్ తెలిపింది.

ఎయిర్‌ ఇండియా విమానంలోని ఇద్దరు ప్రయాణికులు తమ సీట్ల వద్ద బొద్దింకలు ఉన్నాయని ఫిర్యాదు చేసిన అనంతరం వారి సీట్లు మార్చామని  ఎయిర్ ఇండియా తెలిపింది. ‘శాన్ ఫ్రాన్సిస్కో నుండి కోల్‌కతా మీదుగా ముంబైకి వెళ్లే ఏI180 విమానంలో, ఇద్దరు ప్రయాణికులు దురదృష్టవశాత్తూ చిన్న బొద్దింకల కారణంగా ఇబ్బంది పడ్డారు. దీంతో తమ క్యాబిన్ సిబ్బంది ఆ ఇద్దరు ప్రయాణికులను  ఇతర సీట్లకు మార్చారు. అక్కడ వారు  సౌకర్యవంతంగా  కూర్చున్నారు.

ఇంధన స్టాప్ సమయంలో, మా గ్రౌండ్ సిబ్బంది వెంటనే  శుభ్రపరిచే ప్రక్రియను నిర్వహించారు’ అని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. విమానంలో తమ పరిశుభ్రతా చర్యలు కొనసాగుతున్నప్పటికీ, కీటకాలు కొన్నిసార్లు గ్రౌండ్ ఆపరేషన్ల సమయంలో విమానంలోకి ప్రవేశిస్తుంటాయి. ఇటువంటివి జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటామని ఎయిర్‌లైన్ తెలిపింది, ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నామని పేర్కొంది.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)