Breaking News

సీఎం యోగి వార్నింగ్‌.. ‘ వివాదాస్పద వ్యాఖ్యలకు శిక్ష తప్పదు’

Published on Mon, 10/07/2024 - 17:12

లక్నో: ఇతర మతానికి, విశ్వాసానికి సంబంధించిన సాధువులు, పూజారులపై కించపరిచే వ్యాఖ్యలు చేయటం ఆమోదయోగ్యం కాదని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసినవారిని శిక్షించేందుకు వెనకాడబోమని హెచ్చరించారు. ప్రతీ మతాన్ని, విశ్వాసాన్ని గౌరవించాలని అన్నారు. రాబోయే పండుగల నేపథ్యంలో శాంతిభద్రతలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఇతర అధికారులతో సీఎం యోగి సోమవారం సమీక్ష నిర్వమించారు.  

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఎవరైనా మత విశ్వాసాన్ని దెబ్బతీస్తే విధంగా సాధువులు, పూజారులు, దేవతలకు వ్యతిరేకంగా కించపరిచే వ్యాఖ్యలు చేస్తే వాళ్లు చట్ట వ్యతిరేక పరిధిలోకి వస్తారు. అలాంటివారిని కఠినంగా శిక్షిస్తాం. అన్ని వర్గాల, మతాల ప్రజలు ఒకరినొకరు గౌరవించుకోవాలి. నిరసనల పేరుతో అరాచకం, విధ్వంసం, దహనాలను సహించబోం. ఎవరు ఇటువంటి చర్యలకు పాల్పడటానికి ధైర్యం చేసినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది’’ అని అన్నారు.

ఇటీవల పూజారి యతి నర్సింహానంద్ మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ హెచ్చరికలపై ప్రాధాన్యత సంతరించుకుంది. మరోపైపు.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు యతి నర్సింహానంద్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. యతి నర్సింహానంద్‌ను ఘజియాబాద్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆయన సహాయకులు తెలిపారు. అయితే.. ఆయన సహాయకులు చేసిన వ్యాఖ్యలను పోలీసులు ఇంకా ధృవీకరించలేదు.

చదవండి: అమ్మవారికి కష్టాలు చెప్పుకుంటూ.. ట్రాన్స్‌జండర్ల పూజలు

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)