Breaking News

అద్వానీ రథయాత్రను అడ్డుకున్న పాపం వారిదే: యోగి

Published on Wed, 10/29/2025 - 20:02

అద్వానీ రథయాత్రను అడ్డుకున్నారంటూ ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్‌పై ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆరోపించారు. 1990లో సమస్తిపుర్‌లో జరిగిన ఘటనను గుర్తు చేస్తూ.. ఆ చర్యను ‘పాపం’గా అభివర్ణించారు. ఇవాళ బుధవారం(అక్టోబర్‌ 29) బిహార్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యోగి.. సివాన్, భోజ్‌పూర్, బక్సర్ జిల్లాల్లో మూడు ప్రచార సభల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్‌, ఆర్జేడీలపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

రామ మందిర నిర్మాణం.. దేశంపై 500 ఏళ్ల మచ్చను తొలగించిందని యోగి అన్నారు. ఆర్జేడీ మిత్రపక్షమైన కాంగ్రెస్.. రాముడు లేడని చెబుతోందంటూ.. 2007లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సమర్పించిన అఫిడవిట్‌ను ఆయన ఉదాహరించారు. ఆర్జేడీ అభ్యర్థి ఒసామా షహాబ్ గురించి మాట్లాడుతూ.. ఆయన తండ్రి మొహమ్మద్ షహాబుద్దీన్ దేశవ్యాప్తంగా భయంకర గ్యాంగ్‌స్టర్‌గా పేరుగాంచిన వ్యక్తి అంటూ యోగి ఆరోపించారు. ఆర్జేడీ మళ్లీ 'జంగిల్ రాజ్'ను తీసుకురావాలని చూస్తోందంటూ విమర్శలు గుప్పించారు.

డబుల్ ఇంజిన్ ప్రభుత్వం మహిళల అభివృద్ధికి, భద్రతకు కట్టుబడి ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం కార్పూరీ ఠాకూర్, జగ్జీవన్ రామ్, రాజేంద్ర ప్రసాద్, జయప్రకాశ్ నారాయణ సిద్ధాంతాలపై పనిచేస్తోంది. సీతామఢి జిల్లాలో సీతాదేవి ఆలయ నిర్మాణానికి ఆర్జేడీ వ్యతిరేకంగా ఉందని ఆరోపించారు. అయోధ్య ధామ్ నుంచి సీతామఢి వరకు రూ. 6,100 కోట్లతో కనెక్టివిటీ పనులు జరుగుతున్నాయని యోగి తెలిపారు.
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)