Breaking News

నేడు తిరుచ్చిలో.. సీఎం విజయ్‌ రోడ్‌ షో!

Published on Mon, 06/01/2026 - 08:49

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ప్రభజంనం సృష్టించిన సీఎం విజయ్‌ ప్రపథమంగా ప్రజల్లోకి రానున్నారు. తనకు ఓట్లు వేసి గెలిపిచిన తిరుచ్చి తూర్పు నియోజకవర్గం నుంచి ఆయన కృతజ్ఙతల కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. సోమవారం జరిగే ఈ సభ కోసం తిరుచ్చిలో టీవీకే వర్గాలు భారీ ఏర్పాట్లు చేశాయి. ఎన్నికల అనంతరం ప్రత్యక్షంగా ప్రజలను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయని విజయ్‌ తాజా సభలో ఏదేని ప్రకటన చేయవచ్చు అన్న సంకేతాలు వెలువడ్డాయి.

సాక్షి, చెన్నై: తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసి, సంకీర్ణ పారీ్టల మద్దతుతో ము ఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్‌ విజయ్‌ సోమవారం తిరు చ్చిలో  పర్యటించనున్నారు. ఈ ఎన్నికల్లో విజయ్‌ రెండు నియోజకవర్గాల నుండి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందారు. అందులో ఒకటైన తిరుచ్చి ఈస్ట్‌ (తూర్పు) నియోజకవర్గ ఎమ్మెల్యే పదవికి ఆయన ఇటీవల రాజీనామా చేశారు. తమ పారీ్టకి చారిత్రాత్మక విజయాన్ని అందించి, 108 స్థానాలు గెలవడానికి కారణమైన  ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు సీఎం విజయ్‌ సోమవారం సాయంత్రం 4 గంటలకు రోడ్‌ షోతో పాటుగా బ హిరంగ సభలో ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం చెన్నై నుంచి ప్రైవేట్‌ విమానంలో బయలుదేరి, సాయంత్రం 4 గంటలకు తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి  ఆయన చేరుకుటారు.

13 కిలోమీటర్ల భారీ రోడ్‌ షో 
ఎయిర్‌పోర్ట్‌ నుండి సీఎం విజయ్‌ తన ప్రత్యేక ప్రచార వాహనం (ఓపెన్‌ వ్యాన్‌) ద్వారా భారీ రోడ్‌ షో నిర్వహించనున్నారు. టీవీఎస్‌ టోల్‌గేట్‌ డెయిరీ, సంజీవి నగర్, చతిరం బస్‌ స్టాండ్‌ మీదుగా తిరుచ్చి  జోసెఫ్‌ కాలేజ్‌ గ్రౌండ్‌ వరకు సుమారు 13 కిలోమీటర్ల మేరకు ఈ రోడ్‌ షో జరగనుంది. పాలక్కరై, పోస్టాఫీసు, ఉడ్‌ యార్డ్‌ ప్రాంతాల మీదుగా సాగే ఈ పర్యటన కోసం రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లు, కాలేజీ ప్రవేశ ద్వారం వద్ద విజయ్‌ చిత్రంతో కూడిన భారీ తోరణాలు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజయ్‌ పాల్గొంటున్న తొలి బహిరంగ సభ ఇదే కావడం విశేషం. ఈ కార్యక్రమ విజయవంతం కోసం మంత్రులు బుస్సీ ఆనంద్, సెంగోట్టయ్యన్, రమేష్‌ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భద్రత నిమిత్తం సుమారు 1,000 మందికి పైగా పోలీసులను మోహరించారు.  

3వ స్థానంలో సీఎం విజయ్‌.. 
భారతదేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎన్నికల నామినేషన్ల సమయంలో సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా రూపొందించిన అత్యంత ధనవంతులైన సీఎంల జాబితాలో 3వ స్థానంలో తమిళనాడు సీఎం విజయ్‌ నిలిచారు. జోసెఫ్‌ విజయ్‌ రూ. 648 కోట్ల నికర ఆస్తులతో మూడో స్థానంలో నిలిచారు. ఇందులో చెన్నై, కొడైకనాల్‌లోని నివాసాలతో పాటు సుమారు రూ. 404 కోట్ల చరాస్తులు, రూ. 198 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. కాగా అన్నాడీఎంకే ఎమ్మెల్యే లీమా రోజ్‌ మార్టిన్‌ తమిళనాడు లాల్‌గుడి నియోజకవర్గం నుంచి  గెలిచారు.  లీమా రోజ్‌ మార్టిన్‌ రూ. 5,863 కోట్ల ఆస్తులతో దేశంలోనే అత్యంత ధనవంతురాలైన ప్రజాప్రతినిధిగా రికార్డు సృష్టించారు.

Videos

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)