Breaking News

గ్యాస్‌ కొరత వేళ హోటళ్లు, టీ స్టాళ్లు మూత పడకుండా..

Published on Sat, 03/14/2026 - 16:33

చెన్నై: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా భారత్‌లో గ్యాస్‌ కొరత నెలకొనడంతో హోటళ్లు, రెస్టారెంట్లు, టీ స్టాళ్లు, హాస్టళ్ల వంటి వాటిని నడపలేని పరిస్థితి వస్తోంది. దీంతో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్పీజీలను వాడకుండా విద్యుత్ స్టౌలను వాడుకోవాలని.. ఇలా చేసే హోటళ్లు, టీ స్టాళ్ల వంటివాటికి విద్యుత్‌ బిల్లులో యూనిట్‌కు రూ.2 చొప్పున సబ్సిడీ ఇస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు.

తమిళనాడులో ఏర్పడిన ఎల్పీజీ కొరత వల్ల పరిశ్రమలు, ఫుడ్‌ సెక్టార్‌ సహా అనేక రంగాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించేందుకు శనివారం తమిళనాడు సచివాలయంలో స్టాలిన్ నేతృత్వంలో సమీక్షా సమావేశం జరిగింది. హోటళ‍్ల వంటివాటిలో కార్యకలాపాలు సజావుగా కొనసాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది.

ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన తమిళనాడు విద్యుత్ ఉత్పత్తి పంపిణీ సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ జె.రాధాకృష్ణన్ వివరాలు తెలిపారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉన్నతాధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో తమిళనాడు ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుందని చెప్పారు.

‘గ్యాస్‌ కొరత సమయంలో ఎల్పీజీలు వాడకుండా విద్యుత్ స్టౌలను వాడడం ప్రారంభించే హోటళ్లు, రెస్టారెంట్లు, టీ దుకాణాలు, క్లౌడ్ కిచెన్‌లు, ఇతర ఆహార తయారీ యూనిట్లు.. అదనంగా వినియోగించే విద్యుత్‌కు యూనిట్‌కు రూ.2 చొప్పున సబ్సిడీ ఇస్తాం. కేంద్ర ప్రభుత్వం వాణిజ్య ఎల్పీజీ వినియోగంపై విధించిన పరిమితులు అమల్లో ఉన్నంత కాలం ఈ సబ్సిడీ కొనసాగుతుంది’ అని ప్రకటనలో పేర్కొన్నారు.

ప్రస్తుతం ఉన్న ఎల్పీజీ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు తమిళనాడులో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలతో విద్యుత్ పరికరాలు కొనుగోలు చేయించేందుకు సబ్సిడీతో రుణాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆదేశించారు. అర్హత ఉన్న వ్యాపారులు రూ.3.75 లక్షల వరకు రుణాలకు 25 శాతం సబ్సిడీ పొందవచ్చు. మహిళా వ్యాపార అభివృద్ధి పథకం కింద మహిళలు నడిపే వ్యాపారాలకు రూ.10 లక్షల వరకు రుణంపై గరిష్ఠంగా రూ.2 లక్షలపై 25 శాతం సబ్సిడీ ఇస్తారు.

అదనంగా ఎస‍్సీ, ఎస్టీ వ్యాపారులను ప్రోత్సహించేందుకు అన్నై అంబేడ్కర్ బిజినెస్ ఛాంపియన్స్ పథకం కింద గరిష్ఠంగా రూ.కోటి వరకు 35 శాతం మూలధన సబ్సిడీ ఇస్తారు. అధిక సామర్థ్య విద్యుత్ యంత్రాల వినియోగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యం. తమిళనాడులో తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలి అనుమతితో 60,698 కర్మాగారాలు ఎల్పీజీ, సీఎన్‌జీ, డీజిల్, ఫర్నేస్ ఆయిల్, కట్టెలు వంటి వాటిని  ఉపయోగిస్తూ పనిచేస్తున్నాయి.
 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)