Breaking News

గేట్లు బద్దలు కొట్టారు.. తొక్కిసలాటపై సీఎం సిద్ధరామయ్య

Published on Wed, 06/04/2025 - 20:19

బెంగళూరు: తొక్కిలాసట ఘటన దురదృష్టకరమని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారని.. 33 మంది గాయపడ్డారని ఆయన తెలిపారు. స్టేడియం దగ్గరకు లక్ష మందికి పైగా అభిమానులు వచ్చారు. ఇంత భారీగా జనం వస్తారని ఊహించలేదన్నారు. ‘‘మృతుల కుటుంబాలకు నా సానుభూతి. గాయపడిన వారికి ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్నాం. స్టేడియం కెపాసిటి 35 వేల మంది మాత్రమే. కానీ మూడు లక్షలకు పైగా అభిమానులు తరలివచ్చారు’’ అని సిద్ధరామయ్య అన్నారు.

మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల పరిహారాన్ని సిద్ధరామయ్య ప్రకటించారు. తొక్కిసలాట ఘటనపై విచారణకు ఆదేశిస్తున్నామన్నారు. ఏ  చిన్న ఘటన జరిగినా ప్రభుత్వాన్నే నిందిస్తూ ఉంటారు. ఈ విషాద ఘటనను బీజేపీ రాజకీయం చేయాలని చూస్తోంది. అభిమానులు గేట్లను బద్దలు కొట్టడం వల్లే తొక్కిసలాట ఘటన జరిగింది’’ అని సిద్ధరామయ్య తెలిపారు.

కాగా, ఈ దుర్ఘటనపై ఆయన ‘ఎక్స్‌’లో కూడా ట్వీట్ చేశారు. ఈ వార్త తనను షాక్కు గురిచేసిందన్నారు. ఐపీఎల్ కప్ గెలిచిన ఆనందం.. ఈ దుర్ఘటనతో చెదిరిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలన్నారు. చిన స్వామి స్టేడియానికి అంచనాలకు మించి అభిమానులు రావడం వల్లే ఇలా జరిగిందన్నారు.

ఈ తొక్కిసలాటపై కర్ణాటక ప్రజలకు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ క్షమాపణ చెప్పారు. స్టేడియం కేపాసిటికి మించి భారీగా అభిమానులు వచ్చారని దీంతో.. పోలీసులకు అదుపు చేయలేని పరిస్థితి ఏర్పడిందని.. డీకే మీడియాకు తెలిపారు.
 

 

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)