Breaking News

తమిళనాడులో కలకలం.. సీఎం సహా ముగ్గురి ఇళ్లకు బాంబు బెదిరింపు

Published on Mon, 11/17/2025 - 10:47

చెన్నై: తమిళనాడులో సీఎం స్టాలిన్‌ సహా పలువురు ప్రముఖుల ఇళ్లకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో, రంగంలోకి దిగిన బాంబు స్క్వాడ్‌, పోలీసులు తనిఖీలు చేశారు. అనంతరం, అది ఫేక్‌ బెదిరింపు మొయిల్‌ అని పోలీసులు నిర్ధారించారు.

వివరాల ప్రకారం.. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, నటులు అజిత్ కుమార్, అరవింద్ స్వామి, ఖుష్బు నివాసానికి ఆదివారం రాత్రి బాంబు బెదిరింపు వచ్చింది. రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) కార్యాలయానికి బెదిరింపు ఈ-మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.  సీఎం నివాసం సహా నాలుగు ప్రదేశాలలో భద్రతా తనిఖీలు చేపట్టారు. ఇళ్లు, పరిసర ప్రాంతాలలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ​కొన్ని గంటల పాటు సోదాలు జరిగాయి. తనిఖీ సమయంలో ఎటువంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అది ఫేక్‌ మొయిల్‌ అని నిర్దారించారు. కాగా, బెదిరింపు పంపిన వ్యక్తి గురించి ఎలాంటి వివరాలను అధికారులు వెల్లడించలేదు.

మరోవైపు.. ఇటీవలి కాలంలో తమిళనాడు ప్రముఖుల ఇళ్లకు బాంబు బెదిరింపులు రావడం పోలీసులకు తలనొప్పిగా మారింది. కొందరు ఆకతాయిలు ఇలా ఫేక్‌ కాల్స్‌, ఫేక్‌ మొయిల్స్‌ పెట్టి బాంబు బెదిరింపులకు పాల్పడుతున్నారు. గత వారం కూడా చెన్నైలోని ఇంజంబక్కంలోని అజిత్ కుమార్ నివాసానికి గుర్తు తెలియని వ్యక్తి నుండి బాంబు బెదిరింపు వచ్చింది. అంతకుముందు.. నటుడు అరుణ్ విజయ్‌, ఇళయరాజా స్టూడియోకు సైతం ఇలాగే బాంబు బెదిరింపులు వచ్చాయి.

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)