Breaking News

బీజేపీ, సీపీఎం నేతలా నన్ను ప్రశ్నించేది: సీఎం మమత ఫైర్‌

Published on Fri, 08/16/2024 - 16:46

బెంగాల్‌లో టీఎంసీలు నిరసనలు అప్‌డేట్స్‌.. 

👉బెంగాల్‌లో సీపీఎం, బీజేపీ పార్టీలపై సీఎం మమత సంచలన ఆరోపణలు చేశారు. ఆర్జీ కార్‌ మెడికల్‌ కాలేజ్‌ ఆస్పత్రిలో సీపీఎం, బీజేపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారని మమతా బెనర్జీ ఆరోపించారు.

👉హత్యాచార ఘటనకు మమతా బెనర్జీ నిరసన తెలిపారు. ఈ సందర్బంగా మమత మాట్లాడుతూ..‘సీపీఎం, బీజేపీ కార్యకర్తలు అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఆస్పత్రిలోకి ప్రవేశించి అరాచకం సృష్టించారు. ఈ విషయం నాకు తెలుసు. సీపీఎం కార్యకర్తలు డీవైఎఫ్‌ఐ జెండాలతో, బీజేపీ కార్యకర్తలు జాతీయ పతాకాలు చేతిలో పట్టుకుని అరాచకానికి తెగబడ్డారు. ఇదంతా అక్కడున్న సీసీ టీవీ ఫుటేజీలో కనిపిస్తోంది. జాతీయ పతాకాన్ని దుర్వినియోగం చేసిన వీరిపై చర్యలు చేపట్టాలని కోరారు.

👉మణిపూర్‌ భగ్గుమన్నప్పుడు బీజేపీ, సీపీఎంలు ఎన్ని బృందాలను అక్కడికి పంపాయని ఆమె ప్రశ్నించారు. హథ్రాస్‌, ఉన్నావ్‌కు ఎన్ని బృందాలను ఈ పార్టీలు పంపాయని మమత నిలదీశారు. మణిపూర్, యూపీల్లో అరాచకాలు జరిగినప్పుడు వీరంతా ఎక్కడ ఉన్నారని ఆమె ప్రశ్నించారు. సీపీఎం, బీజేపీ తనను బెదిరించలేవని, ఎన్నికల్లో ప్రజల మద్దతుతోనే తాము ఇక్కడ వరకూ వచ్చామని పేర్కొన్నారు.

 

👉పశ్చిమ బెంగాల్‌లోని ఆర్‌జీ కార్‌ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ క్రమంలో నిందితులను శిక్షించాలనే డిమాండ్‌ బలంగా వినిపిస్తోంది. మరోవైపు.. బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కూడా ఈ ఘటనకు కారణమైన వారిని ఉరి తీయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

👉కాగా, హత్యాచారం ఘటనను ఖండిస్తూ కోల్‌కతాలో సీఎం మమతా, టీఎంసీ నేతలు శుక్రవారం ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా నిందితులను శిక్షించాలని డిమాండ్‌ చేశారు. బాధితురాలికి న్యాయం జరగాలని నినాదాలు చేశారు. 

 

 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)