Breaking News

కేజీవాల్‌పై ఈడీ ఛార్జిషీట్‌లో కవిత పేరు

Published on Wed, 07/10/2024 - 16:05

న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిష‌న్‌పై విచార‌ణ వాయిదా ప‌డింది. మద్యం పాలసీ కుంభకోణం కేసులో కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఢిల్లీ హైకోర్టు బుధవారం జూలై 15కి వాయిదా వేసింది.

ఈ కేసులో కేజ్రీవాల్ ప్రతిస్పందనకు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి మరింత సమయం కావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తరపు న్యాయ‌వాది అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వి రాజు అభ్యర్థించారు. దీంతో హైకోర్టు ఈ కేసును జూలై 15కి వాయిదా వేసింది.

కాగా లిక్క‌ర్ కుంభ‌కోణానికి సంబంధించిన ఈడీ కేసులో కేజ్రీవాల్‌కు ట్రయల్ కోర్టు వెకేషన్ బెంచ్ బెయిల్ మంజూరు చేసిన విష‌యం తెలిసిందే. అయితే ట్రయల్ కోర్టు ఉత్తర్వులపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది.

ఢిల్లీ లిక్క‌ర్ కుంభకోణంలో 38 మంది నిందితులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. చార్జిషీట్‌లో అరవింద్ కేజ్రీవాల్‌తోపాటు ఆమ్ ఆద్మీ పార్టీని నిందితుల జాబితాలో చేర్చింది. 232 పేజీల ఛార్జ్ షీట్‌లో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై ఈడీ తీవ్ర ఆరోపణలు చేసింది.

ఈ కేసులో కేజ్రీవాల్‌ను కింగ్‌పిన్‌గా, కుట్ర‌దారుడిగా ఈడీ అభివ‌ర్ణించింది. లిక్క‌ర్ స్కాంలో పొందిన డబ్బును గోవా ఎన్నిక‌ల్లో ఆప్ ఉప‌యోగించింద‌ని ఆరోపించింది. కేజ్రీవాల్‌, వినోద్ చౌహ‌న్‌తో వాట్సాప్ చాట్‌ల‌ను ఈడీ చార్జిషీట్‌లో ప్ర‌స్తావించింది. 

లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌పై ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో కవిత పేరును కూడా ప్రస్తావించింది. కవిత మాజీ పీఏ అశోక్ కౌశిక్ ద్వారా రూ. 25 కోట్ల లావాదేవిలు జరిగినట్లు ఈడీ తెలిపింది. కవిత దగ్గర నుంచి రెండు బైకుల్లో నగదు తీసుకెళ్ళి దినేష్ అరోరాకు అప్పగించారు. ఢిల్లీలోని వినోద్ చౌహన్ దగ్గర అశోక్, దినేష్ అరారోలు కలుసుకున్నారు. గోవా ఎన్నికల సందర్భంగా వినోద్ చౌహన్ డబ్బుల పంపిణీ చేశాడు. ముత్త గౌతమ్ సంబంధించిన మీడియా సంస్థ ద్వారా హవాలా లావాదేవీలు జరిగాయి.

కేజ్రీవాల్ ఛార్జిషీట్లో కవిత పేరు "ఆ 100 కోట్ల ముడుపుల లెక్క"

అభిషేక్ బోయినపల్లి, ముత్తా గౌతమ్‌తో కలిసి ఏడు కోట్ల రూపాయలను అవార్ల ద్వారా అరవింద్ సింగ్ ఇచ్చారు.  45 కోట్ల రూపాయలను గోవాకు  హవాలా ద్వారా సాగర్ పార్టీలకు చేరవేశారు. ముత్త గౌతమ్‌కు సంబంధించిన చారియట్ మీడియా ద్వారా మీడియా ద్వారా డబ్బుల లావాదేవీలు జరిగాయి. చారియట్ మీడియాకు సంబంధించిన వ్యక్తులు తోపాటు చాలామందికి లింకులు ఉన్నాయని ఈడీ పేర్కొంది.

మ‌రోవైపు కేజ్రీవాల్‌, ఆప్‌పై దాఖ‌లు చేసిన‌ చార్జిషీట్‌ను ఢిల్లీ కోర్టు మంగళవారం విచారణకు తీసుకుంది. కేజ్రీవాల్‌కు స‌మ‌న్లు పంపింది.

కాగా మార్చి 21న ఈడీ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసింది. ప్ర‌స్తుతం ఆయ‌న  జ్యుడీషియల్ కస్టడీలో ఉండగా, జూన్ 26న అవినీతి కేసులో ఆప్ అధినేతను సీబీఐ అరెస్టు చేసింది. సీబీఐ అరెస్టు, రిమాండ్‌ను సవాలు చేస్తూ కేజ్రీవాల్ దాఖలైన పిటిషన్ హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ కేసులో గత వారం ఢిల్లీ హైకోర్టు సీబీఐకి నోటీసులు జారీ చేసింది. దీనిపై స్పందించేందుకు ద‌ర్యాప్తు సంస్థ‌కు కోర్టు ఏడు రోజుల గడువు ఇచ్చింది. ఈ కేసు తదుపరి విచారణ జూలై 17కు వాయిదా వేసింది..

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?