Breaking News

ఢిల్లీలో 'ముంబై అండర్‌వరల్డ్‌' ​​పరిస్థితి: సీఎం అతిషి

Published on Mon, 10/21/2024 - 10:16

ఢిల్లీ: ఢిల్లీ రోహిణిలోని ఓ పాఠశాల సమీపంలో జరిగిన పేలుడు ఘటనపై  ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితిపై అతిషి కేంద్రంలో ఉన్న బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో నెలకొన్న  పరిస్థితి.. అండర్‌వరల్డ్‌ కాలంతో ముంబైలా మారిపోయిందని  ‘ఎక్స్‌’ వేదికగా ఆరోపించారు.

‘ఢిల్లీలో శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ఉంది. కానీ బీజేపీ శాంతిభద్రతలను పట్టించుకోదు. ఢిల్లీ ప్రభుత్వాలు చేస్తే.. పనికి అంతరాయం కలిగించడానికి మాత్రం తన  పూర్తి సమయాన్ని ఉపయోగిస్తుంది. అందుకే ఇప్పుడు ఢిల్లీ పరిస్థితి.. అండర్ వరల్డ్ కాలంలో ముంబైలా తయారైంది. బహిరంగంగా బుల్లెట్లు పేల్చుతున్నారు. గ్యాంగ్‌స్టర్లు డబ్బు వసూలు చేస్తున్నారు. నేరస్థులు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. శాంతి భద్రతలను కాపాడే ఉద్దేశం లేదా అదుపులోకి తీసుకువచ్చే సామర్థ్యం బీజేపీకి లేదు’ అని  అన్నారు.

ఇక.. పొరపాటున ఢిల్లీ వాసులు బీజేపీకి ప్రభుత్వ బాధ్యతలు అప్పగిస్తే.. ఆసుపత్రులు, విద్యుత్, నీటి సరఫరా పరిస్థితి ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితి మాదిరిగానే దారుణంగా మారుతుందని సీఎం అతిషి  ఎద్దేవా చేశారు. ఢిల్లీలోని రోహిణిలో ప్రాంతం ఓ పాఠశాల గోడపై బాంబు పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. పేలుడు ధాటికి పాఠశాల గోడను ద్వంసమై.. సమీపంలోని కార్లు దెబ్బతిన్నాయి.

చదవండి: ఢిల్లీ పేలుడు: ఖలిస్తానీ హస్తంపై టెలిగ్రామ్‌కు లేఖ

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)