Breaking News

ప్రభుత్వాన్ని జైలు నుంచే నడవపచ్చని నిరూపించాం: కేజ్రీవాల్‌

Published on Sun, 09/15/2024 - 12:46

న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు వచ్చాక తొలిసారి ఆదివారం పార్టీ కార్యాలయానికి వచ్చారు. అక్కడ ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలతో సంభాషించారు. తనకు జైల్లో పుస్తకాలు చదవడానికి, ఆలోచించడానికి చాలా సమయం దొరికిందని కేజ్రీవాల్‌ అన్నారు. తాను గీతను చాలాసార్లు చదివానని, ఈ రోజు నేను మీ ముందుకు ‘భగత్ సింగ్ జైల్ డైరీ’తీసుకువచ్చానని అన్నారు. భగత్ సింగ్ జైలులో చాలా లేఖలు రాశారు. భగత్ సింగ్ బలిదానం జరిగిన 95 ఏళ్ల తర్వాత ఒక విప్లవ ముఖ్యమంత్రి జైలుకు వెళ్లాడు. నేను ఎల్‌జీకి జైలు నుంచి ఒక లేఖ రాశాను. జాతీయ జెండా ఎగురవేసేందుకు అతిషీకి అనుమతివ్వాలని ఆగస్టు 15వ తేదీకి ముందు లేఖ రాశాను. ఆ లేఖ ఎల్‌జీకి అందలేదు. మరోసారి లేఖ రాస్తే కుటుంబ సభ్యులను కలిసే అవకాశాన్ని నిలిపివేస్తామని హెచ్చరించారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచాక తమకంటే క్రూరమైన పాలకుడు ఈ దేశానికి వస్తాడని బ్రిటీష్ వారు కూడా ఊహించి ఉండరు అని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు.

తాను జైల్లో ఉన్నప్పుడు ఒకరోజు సందీప్ పాఠక్ తనను కలవడానికి వచ్చాడు. అతను నాతో రాజకీయాల గురించి మాట్లాడాడు. దేశంలో ఏమి జరుగుతోంది, పార్టీలో ఏమి జరుగుతోంది అని నేను అడిగాను.  ఇది జరిగాక సందీప్ పాఠక్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టారు. ఆమ్ ఆద్మీ పార్టీని విచ్ఛిన్నం చేయడం, కేజ్రీవాల్ ధైర్యాన్ని దెబ్బతీయడం వారి లక్ష్యం. వారు ఒక ఫార్ములా తయారుచేశారు. కేజ్రీవాల్‌ను జైలుకు పంపితే ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే ఫీలింగ్‌లో ఉన్నారు. అయితే మా పార్టీ విచ్ఛిన్నం కాలేదు. మా ఎమ్మెల్యేలు విచ్ఛిన్నం కాలేదు. వారి పెద్ద కుట్రలకు వ్యతిరేకంగా పోరాడే శక్తి ఆమ్ ఆద్మీ పార్టీకి మాత్రమే ఉంది.
ప్రభుత్వాన్ని జైలు నుంచే నడపవచ్చని నిరూపించామని కేజ్రీవాల్‌ అన్నారు.

ప్రభుత్వాన్ని జైలు లోపల నుండి ఎందుకు నడపకూడదని సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అప్పుడు మేము ప్రభుత్వాన్ని నడపగలమని నిరూపించాం. బీజేపీయేతర ముఖ్యమంత్రులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఎప్పుడైనా మిమ్మల్ని అరెస్టు చేసే ప్రయత్నం జరిగితే భయపడవద్దు. ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీకి వారి కుట్రలన్నింటిని తిప్పికొట్టే శక్తి ఉంది ఎందుకంటే మనం నిజాయితీపరులం. వారు నిజాయితీ లేనివారు కాబట్టి మన నిజాయితీకి భయపడతారని సీఎం కేజ్రీవాల్‌ పేర్కొన్నారు.

 



ఇది కూడా చదవండి: సెబీ చీఫ్‌పై మరోసారి కాంగ్రెస్‌ ఆరోపణలు

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)