Breaking News

jammu Kashmir: రంబన్‌లో క్లౌడ్‌ బరస్ట్‌.. అంతటా హాహాకారాలు.. ముగ్గురు మృతి

Published on Sat, 08/30/2025 - 08:59

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని రంబన్ జిల్లాలో  క్లౌడ్‌ బరస్ట్‌ సంభవించింది. ఫలితంగా ఆకస్మిక వరదలు తలెత్తాయి. అనేక ఇళ్లు జల సమాధి అయ్యాయి. ఈ ప్రకృతి వైపరీత్యంలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. నలుగురు గల్లంతయ్యారు. స్థానిక అధికారులు, విపత్తు నిర్వహణ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి.

రంబన్‌లో క్లౌడ్‌ బరస్ట్‌ కారణంగా స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. భారీ వర్షాలు సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగిస్తున్నాయి. అయినప్పటికీ రెస్క్యూ సిబ్బంది బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. క్లౌడ్‌ బరస్ట్‌ కారణంగా అకస్మాత్తుగా వచ్చిన వరదలతో పలు ఇళ్లు జలమయమయ్యాయి. కల్వర్టులు, రోడ్లు  ధ్వంసమయ్యాయి. వాతావరణ శాఖ భారీ వర్ష సూచనకు సంబంధించిన హెచ్చరిక జారీ చేసింది.

ఆగస్టు 14న చిసోటిలో క్లౌడ్‌ బరస్ట్‌ కారణంగా సంభవించిన విపత్తులకు 65 మంది మృతిచెందారు. వీరిలో  అధిక సంఖ్యలో పర్యాటకులున్నారు. ఈ ఘటనల్లో 100 మందికి పైగా ప్రజలు గాయపడ్డారు.  ఇదేవిధంగా కథువా జిల్లాలో ఆకస్మిక వరదకు ఐదుగురు పిల్లలతో సహా ఏడుగురు మృతి చెందారు. మంగళవారం రియాసి జిల్లాలోని వైష్ణో దేవి మార్గంలో కొండచరియలు విరిగిపడి, 34 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోగా, 20 మంది గాయపడ్డారు. ఆకస్మిక వరదల తరువాత పరిస్థితిని సమీక్షించేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆగస్టు 24న జమ్మూను సందర్శించారు.

 

Videos

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)