Breaking News

బెంగళూరు తొక్కిసలాట కేసు: ఐపీఎస్ అధికారులకు క్లీన్ చిట్

Published on Wed, 07/15/2026 - 13:01

బెంగళూరు: గత ఏడాది జూన్ నెలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఐపీఎల్ విజయోత్సవాల సందర్భంగా ఎం చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన  తొక్కిసలాట కేసులో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాటి బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ బీ దయానందతో పాటు మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులపై కొనసాగుతున్న శాఖాపరమైన విచారణను ప్రభుత్వం ముగిస్తూ, వారికి క్లీన్ చిట్ ఇచ్చింది.

ఈ దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా జనం తీవ్రంగా గాయపడ్దారు. ఘటన జరిగిన వెంటనే అప్పటి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించి, బాధ్యులని భావించిన కమిషనర్ బి. దయానంద, అదనపు పోలీస్ కమిషనర్ వికాస్ కుమార్ వికాస్, నాటి డీసీపీ (సెంట్రల్) శేఖర్ సహా పలువురు అధికారులను సస్పెండ్ చేశారు. అయితే తాజాగా సంబంధిత అధికారులు సమర్పించిన వివరణలు, పరిపాలనా విభాగం అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, వారిపై విచారణను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

మరోవైపు, ఈ ఘటనకు సంబంధించి హైకోర్టుకు సమర్పించిన నివేదికలో ప్రభుత్వం ఆర్సీబీ యాజమాన్యమే ప్రధాన బాధ్యత వహించాలని పేర్కొంది. అనుమతులు తీసుకోకుండానే కార్యక్రమం నిర్వహించడం, జనసమూహాన్ని అదుపు చేయడంలో విఫలమవ్వడం వంటి లోపాలను ప్రభుత్వం ఎత్తిచూపింది. ఈ దుర్ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోంది.

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)