Breaking News

Odisha: ఘర్షణల్లో యువకుని మృతి.. ఖుర్దాలో నిషేధాజ్ఞలు

Published on Mon, 08/26/2024 - 09:08

ఒడిశాలోని ఖుర్దా జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ  ఒక యువకుని మృతికి దారితీసింది. ఈ ఘటన నేపధ్యంలో మరిన్ని అల్లర్లు జరగకుండా ఉండేందుకు పోలీసులు ఇండియన్ సివిల్ సెక్యూరిటీ కోడ్ (బీఎన్‌ఎస్‌స్‌)లోని సెక్షన్ 163 కింద జిల్లాలో నిషేధాజ్ఞలు విధించారు. ఖుర్దా పట్టణ శివార్లలోని ముకుంద్ ప్రసాద్ గ్రామంలో ఈ ఘటన జరిగిందని, ఘర్షణకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు.

ఈ ఘర్షణల్లో గాయపడిన వ్యక్తిని ఖుర్దా జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు పరిశీలించి, అతను మృతిచెందినట్లు ప్రకటించారు. ఇరువర్గాల మధ్య జరిగిన హింసాకాండలో పలు వాహనాలు దెబ్బతిన్నాయని పోలీసులు తెలిపారు. డీజీపీ యోగేష్ బహదూర్ ఖురానియా, ఇంటెలిజెన్స్ డైరెక్టర్ ఎస్.కె. ప్రియదర్శి పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ఆ ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.

ఈ హత్య అనంతరం స్థానికులు రోడ్డుపై బైఠాయించి వీరంగం సృష్టించారని పోలీసు సూపరింటెండెంట్ అవినాష్ కుమార్ మీడియాకు తెలిపారు. అయితే నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో జనం అక్కడినుంచి వెళ్లిపోయారన్నారు. జిల్లా మేజిస్ట్రేట్ చంచల్ రాణా మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారన్నారు. ఘర్షణల దరిమిలా ఖుర్దా మున్సిపాలిటీలోని వివిధ వార్డులలో తక్షణమే నిషేధాజ్ఞలు విధించినట్లు ఆయన చెప్పారు. దీంతో ఈ ప్రాంతంలో పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, వాణిజ్య సంస్థలు మూతపడనున్నాయి. అయితే అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆంక్షలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)