Breaking News

సెలవుల్లో పని చేయడానికి లాయర్లు ఇష్టపడడం లేదు 

Published on Thu, 05/22/2025 - 06:19

న్యూఢిల్లీ: సెలవు రోజుల్లో పని చేయడానికి న్యాయవాదులు ఇష్టపడడం లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. మరోవైపు పెండింగ్‌ కేసులు పరిష్కరించడం లేదంటూ న్యాయ వ్యవస్థపై విమర్శలు వస్తున్నాయని పేర్కొంది. తమ పిటిషన్‌పై విచారణను వేసవి సెలవుల తర్వాత ప్రారంభించాలని కోరిన ఓ న్యాయవాది పట్ల ధర్మాసనం బుధవారం అసంతృప్తి వ్యక్తంచేసింది. 

సుప్రీంకోర్టులో మొదటి ఐదుగురు న్యాయమూర్తులు వేసవి సెలవుల్లోనూ విధులు నిర్వర్తిస్తారని తెలియజేసింది. అయినప్పటికీ బ్యాక్‌లాగ్‌ కేసుల విషయంలో తమపై నిందలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తంచేసింది. వాస్తవానికి వేసవి సెలవుల్లో పని చేయడం లాయర్లకు ఎంతమాత్రం ఇష్టం లేదని ఆక్షేపించింది. సుప్రీంకోర్టుకు ఈ నెల 26 నుంచి జూలై 13 వరకు వేసవి సెలవులు ప్రకటించారు. ఈ మేరకు న్యాయస్థానం నోటిఫికేషన్‌ జారీ చేసింది. 

సెలవుల సమయంలోనూ ధర్మాసనాలు పాక్షికంగా పని చేయాలని సూచించింది. రెండు నుంచి ఐదు వెకేషన్‌ బెంచ్‌లు పని చేయాలని నిర్దేశించింది. సీజేఐ సహా ఐదుగురు న్యాయమూర్తులు విధులకు హాజరవుతారు. గతంలో వేసవి సెలవుల్లో కేవలం రెండు వెకేషన్‌ బెంచ్‌లు పనిచేసేవి.

 సీనియర్‌ న్యాయమూర్తులు విధులు నిర్వర్తించాలన్న నిబంధన ఉండేది కాదు. కానీ, ఈ నిబంధనల్లో సుప్రీంకోర్టు తాజాగా మార్పులు చేసింది. ఈ నెల 26 నుంచి ఐదు ధర్మాసనాలకు జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్, జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ విక్రంనాథ్, జస్టిస్‌ జె.కె.మహేశ్వరి, జస్టిస్‌ బి.బి.నాగరత్న నేతృత్వం వహిస్తారు. అలాగే సుప్రీంకోర్టు రిజిస్ట్రీ అన్ని పనిదినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా తెరిచి ఉంటుంది.  

Videos

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు