Breaking News

CJI DY Chandrachud: జూనియర్లకు సరైన వేతనాలివ్వండి

Published on Sun, 10/27/2024 - 05:22

న్యూఢిల్లీ:  ‘‘న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించి, నైపుణ్యాలు పెంచుకోవడానికి మీ వద్ద పనిచేసే యువతకు సరైన వేతనాలు, పారితోషికాలు చెల్లించడం మీరు తప్పనిసరిగా నేర్చుకోవాలి’’ అని న్యాయవాదులకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ సూచించారు. న్యాయవాద వృత్తి చాలా సంక్లిష్టమైందని చెప్పారు.

 ప్రాథమిక స్థాయిలో నేర్చుకున్న నైపుణ్యాలే యువ న్యాయవాదులను ముందుకు నడిపిస్తాయని, అవి వారికి జీవితాంతం తోడ్పడుతాయని తెలిపారు. పునాది బలంగా ఉండాలని పేర్కొన్నారు. తాజాగా ఆలిండియా రేడియో ఇంటర్వ్యూలో జస్టిస్‌ చంద్రచూడ్‌ పలు విషయాలు వెల్లడించారు. ఈ వృత్తిలో ఎన్నో ఎత్తుపల్లాలు, ఒడిదుడుకులు ఉంటాయని, ప్రారంభంలో వేతనాలు ఎక్కువగా ఉండకపోవచ్చని వెల్లడించారు. 

న్యాయవాద వృత్తిలోకి వచ్చేవారు కష్టపడి పనిచేయాలని, నిజాయతీగా ఉండాలని పేర్కొన్నారు. యువ లాయర్లను ప్రోత్సహించడం చాలా ముఖ్యమని స్పష్టంచేశారు. జూనియర్లకు సీనియర్‌ లాయర్లు గురువులుగా కొత్త విషయాలు నేరి్పస్తూనే సంతృప్తికరమైన వేతనాలు చెల్లించడం తప్పనిసరి అని వ్యాఖ్యానించారు. తాను కాలేజీలో చదువుకొనే రోజుల్లో ఆలిండియా రేడియోలో ప్రయోక్తగా పనిచేశానని జస్టిస్‌ చంద్రచూడ్‌ గుర్తుచేసుకున్నారు.

 శాస్త్రీయ సంగీత కళాకారిణి అయిన తన తల్లి తనను ముంబైలోని ఆలిండియా రేడియో స్టూడియోకు తీసుకెళ్తూ ఉండేవారని చెప్పారు. 1975లో ఢిల్లీకి వచ్చాక ఆకాశవాణిలో హిందీ, ఇంగ్లిష్‌ కార్యక్రమాలు నిర్వహించానని వివరించారు. చిన్నప్పుడు తన తల్లిదండ్రులతో కలిసి రేడియోలో హిందీ, ఇంగ్లి‹Ù, సంస్కృత కార్యక్రమాలు విన్నానని తెలిపారు. దేవకి నందన్‌ పాండే, పమేలా సింగ్, లోతికా రత్నం గొంతులకు తాను అభిమానినని చెప్పారు. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)