Breaking News

స్కూల్‌లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్‌ జస్టిస్‌

Published on Sun, 05/05/2024 - 16:20

ఖాట్మాండ్‌: పిల్లలను క్రమశిక్షణతో పెంచే క్రమంలో దండించడాన్ని ఈరోజుల్లో చాలా కఠిన పద్దతిగా భావిస్తున్నారు. అయితే కొన్ని దశాబ్దాల కింద పాఠశాలల్లో అందరూ ఉపాధ్యాయుల చేతిలో బెత్తం దెబ్బలు తిన్నావారే. అటువంటి చిన్ననాటి సంఘటనను భారత​ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ స్వయంగా పంచుకున్నారు. 

చిన్నతనంలో తాను ఓ చిన్న తప్పుకు బెత్తం దెబ్బలు తిన్నానని తెలిపారు. చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేపాల్‌ పర్యటనలో భాగంగా ఖాట్మాండ్‌లో నిర్వహించిన ‘జువెనైల్ జస్టిస్’ అనే అంశానికి సంబంధించిన ఓ సెమినార్‌లో పాల్గోని మాట్లాడారు. 

‘చిన్నారులతో మనం ప్రవర్తించే తీరు వారి మనసులో జీవితాంతం గుర్తుండిపోతుంది. నేను కూడా నా చిన్న తనంలో స్కూల్‌లో జరిగిన ఘటనను ఇప్పటికీ మర్చిపోలేదు. నా చేతులు బెత్తం దెబ్బలు తిన్న సమయంలో నేను ఏ నేరం చేయలేదు. క్రాఫ్ట్‌ నేర్చుకోవటంలో భాగంగా అసైన్‌మెంట్‌కు సరైన సూదిని తీసుకురాలేదు. దీంతో టీచర్‌తో బెత్తం దెబ్బలు తిన్నా. నా చెతులపై కొట్టవద్దని టీచర్‌ను  బతిమాలాడాను.  అయినా టీచర్‌ వినలేదు.

బెత్తం దెబ్బ కారణంగా కుడి చేతికి అయిన చిన్న గాయం విషయాన్ని నా తల్లిదండ్రులకు పదిరోజుల పాటు చెప్పకుండా దాచిపెట్టాను. ఐదో తరగతిలో జరిగిన ఈ ఘటన సంబంధించి బెత్తం దెబ్బ భౌతికంగా అప్పుడే మానిపోయినప్పటికి దాని ప్రభావం నాపై చాలా పడింది. నేను ఏ పని చేసినా ఆ ఘటన గుర్తుకు వచ్చేది. చిన్నపిల్లల్లో ఇటువంటి ఘటనలు ప్రభవం వారి మనసుపై తీవ్రంగా ప్రభావం చూపుతాయి’ అని జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ చెప్పారు.    

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)