Breaking News

రూ. 15 వేలు లంచం తీసుకుంటూ సివిల్‌ సర్వీస్‌ టాపర్‌ అరెస్టు

Published on Sat, 09/13/2025 - 12:34

సంబల్‌పూర్: ఒడిశాలోని సంబల్‌పూర్ జిల్లాలోని బమ్రా తహశీల్దార్‌గా పనిచేస్తున్న రాష్ట్ర సివిల్ సర్వీస్ పరీక్ష టాపర్ అశ్విని కుమార్ పాండా అవినీతికి పాల్పడుతూ ఒడిశా విజిలెన్స్ అధికారులకు దొరికిపోయారు. వ్యవసాయ భూమిని ఇంటి భూమిగా మార్చేందుకు ఒక వ్యక్తి నుంచి రూ. 15 వేలు లంచం తీసుకుంటుండగావిజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు.

నెల రోజుల క్రితం ఫిర్యాదుదారు తహశీల్దార్ కార్యాలయంలో భూమి మార్పిడి కోసం దరఖాస్తు చేసుకున్నట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. 
‘పాండా రూ. 20,000 లంచం డిమాండ్ చేసి, ఫిర్యాదుదారునికి అనుకూలంగా హక్కు రికార్డు (ఆఓఆర్‌)జారీ చేశాడు. అయితే అంత మొత్తాన్ని చెల్లించలేనని ఆ వ్యక్తి తహశీల్దార్‌ పాండాకు తెలిపారు. దీంతో పాండా లంచం మొత్తాన్ని రూ. 15,000 కు తగ్గిస్తూ, ఇది కూడా చెల్లించకుంటే మ్యుటేషన్ కేసులో ఈ మార్పిడిని అనుమతించబోనని పాండా బెదిరించాడని విజిలెన్స్ ఒక ప్రకటనలో పేర్కొంది.

దీనిపై ఫిర్యాదుదారు విజిలెన్స్ అధికారులను తెలియజేశాడు.దీంతో ఒక పథకం ప్రకారం అధికారులు శుక్రవారం వల వేసి, అశ్విని కుమార్ పాండాను పట్టుకున్నారు.  అనంతరం పాండాకు చెందిన భువనేశ్వర్‌లోని  ఇంటిలో తనిఖీలు చేపట్టి, రూ.4,73,000 విలువైన నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆయన డ్రైవర్ పి ప్రవీణ్ కుమార్‌ను కూడా అవినీతి నిరోధక చట్టం కింద విజిలెన్స్ అధికారులు అరెస్టు చేశారు. మెకానికల్ ఇంజనీరింగ్‌లో బి.టెక్ చేసిన పాండా 2019లో ఒడిశా సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో అగ్రస్థానంలో నిలిచారు. 2021, డిసెంబర్‌లో జూనియర్ ఒడిశా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌ (ఓఏఎస్‌)లో చేరి, ట్రైనింగ్ రిజర్వ్ ఆఫీసర్ (టీఆర్‌ఓ)గా ప్రభుత్వ సేవలో ప్రవేశించారు.
 

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)