Breaking News

ఒకే ఒక్కడు..! 

Published on Mon, 02/16/2026 - 06:23

ఢిల్లీ.. దేశ రాజధాని! మెరిసిపోయే మెట్రోలు, రాజప్రసాదాల్లాంటి భవనాలు.. కానీ వాటి వెనుకే వికృతమైన మురికి కూపాలు. రోడ్ల పక్కన పేరుకుపోయిన చెత్త కుప్పలు, బస్టాండ్ల దగ్గర దుర్గంధాలు అలవాటైపోయాయి. చూసీచూడనట్టు ముక్కు ముడుచుకుని వెళ్లిపోవడం నగరజీవి దైనందిన చర్య అయిపోయింది.

 కానీ, ఆ మురికిని చూసి ఒక సామాన్యుడి రక్తం మరిగింది. అతనే మహమ్మద్‌ ఆసిఫ్‌ అలియాస్‌ ‘ఆసిఫ్‌ హిందుస్తానీ’. తన చేతిలోని కెమెరాను ఆయుధంగా, చీపురును ధ్వజంగా మార్చుకుని, ఏళ్ల తరబడి పేరుకుపోయిన పాలకుల నిర్లక్ష్యంపై ఆసిఫ్‌ ఒంటరి పోరాటం మొదలుపెట్టాడు.  

నలుగురికి 62 పార్కుల బాధ్యత ఆసిఫ్‌ చేసేది కేవలం వీధులు ఊడ్చడం కాదు.. ప్రభుత్వ అసమర్థతను నిలదీయడం.. ఢిల్లీలోని రోహిణిలో ఒక మురికి బస్టాండ్‌ను స్వయంగా శుభ్రపరచిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో అధికారుల వెన్నులో వణుకు మొదలైంది. ఆయన నిగ్గు తేలి్చన వాస్తవాలు వింటే ఎవరికైనా మతిపోవాల్సిందే. 

పశి్చమ ఢిల్లీలో కేవలం నలుగురు పారిశుధ్య కార్మికులు కలిసి 62 పార్కులను నిర్వహించాలట! ఇది మనుషులకు సాధ్యమయ్యే పనేనా? పారిశుధ్య కారి్మకులకు పని చేయాలనే ఉన్నా, వారి దగ్గర సరైన పరికరాలు లేవు. కాలం చెల్లిపోయి, కనీసం చెత్తను లోడ్‌ చేయడానికి కూడా పనికిరాని తుప్పు పట్టిన వాహనాలు అధికారుల దౌర్భాగ్యానికి నిదర్శనాలుగా నిలుస్తున్నాయి. 

నిర్లక్ష్యపు గోడలు బద్దలు కొడుతూ.. 
‘పరిశుభ్రత.. అనేది ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, అది వ్యక్తిగత జవాబుదారీతనం’.. అని ఆసిఫ్‌ గట్టిగా నమ్ముతున్నాడు. చిప్స్‌ ప్యాకెట్‌ లేదా ప్లాస్టిక్‌ స్ట్రా రోడ్డుపై పారేసే ముందు ‘ఒక్క క్షణం ఆగి ఆలోచించండి’అని ఆయన పిలుపునిస్తున్నాడు. ఆ ఒక్క క్షణం చేసే ఆలోచనే నగరాన్ని మారుస్తుందన్నది ఆయన వాదన. మౌలిక వసతుల కన్నా మనుషుల మైండ్‌సెట్‌ మారడమే నిజమైన పరిష్కారమని నిరూపిస్తున్నాడు. వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతూనే, పౌర బాధ్యతను గుర్తు చేస్తున్న ఆసిఫ్‌ పోరాటం ఇప్పుడు ఒక ప్రభంజనంలా మారుతోంది.  

రేపటి కల.. సంయుక్త పోరాటం 
ఆసిఫ్‌ లక్ష్యం కేవలం ఒక్క రోజు నిరసన కాదు. ఇది ఒక సుదీర్ఘ ప్రయాణం. యువతలో చైతన్యం తీసుకురావడం ద్వారా పరిశుభ్రతను ఒక అలవాటుగా మార్చాలని ఆయన ఆకాంక్షిస్తున్నాడు. ‘ప్రభుత్వం, పౌరులు కలిసి పనిచేసే ఒక పటిష్టమైన నమూనా రావాలి’.. అని ఆయన గొంతెత్తుతున్నాడు. అధికారుల ఏసీ గదుల వెనుక దాగున్న ఉదాసీనతను కడిగేయాలంటే, సామాన్యుడు ఇలా వీధిలోకి రాక తప్పదని ఆసిఫ్‌ తన ప్రతి అడుగుతోనూ చాటి చెబుతున్నాడు.

    – సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)