Breaking News

పౌరుల స్వేచ్ఛ...ప్రభుత్వ తొలి బాధ్యత

Published on Sat, 12/20/2025 - 06:28

న్యూఢిల్లీ: ‘స్వేచ్ఛ దేశ పౌరులకు ప్రభుత్వాలిచ్చే కానుక కాదు. వారిపట్ల వాటి తొలి బాధ్యత. ఎందుకంటే రాజ్యాంగం వారికి కల్పించిన మౌలిక హక్కు’అని అత్యున్నత న్యాయస్థానం కుండబద్దలు కొట్టింది. పాస్‌ పోర్ట్‌ రెన్యువల్‌ కోసం భావి విదేశీయానాలు, వీసా వివరాలను పాస్‌పోర్ట్‌ అథారిటీ డిమాండ్‌ చేయడం సరికాదని స్పష్టం చేసింది. ‘జీవనోపాధి, అవకాశాల అన్వేషణలో భాగంగా చట్టబద్ధంగా ఎక్కడికైనా వెళ్లేందుకు, ప్రయాణించేందుకు పౌరులకు అన్ని హక్కులూ ఉన్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 ఇందుకు వీలు కల్పిస్తోంది’అని జస్టిస్‌ విక్రమ్‌ నాథ్, జస్టిస్‌ ఎ.జి.మసీహ్‌ల ధర్మాసనం గుర్తు చేసింది. 

క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ పెండింగ్‌లో ఉన్న ఉదంతాల్లో నిందితుల విదేశీయానం సంబంధిత కోర్టుల దృష్టిలో ఉందా లేదా అన్నది మాత్రమే దాని పని అని పేర్కొంది. జార్ఖండ్‌ బొగ్గు గనుల కేటాయింపు కేసులో ఎన్‌ఐఏ విచారణ ఎదుర్కొంటున్న మహేశ్‌ కుమార్‌ ఝా అనే వ్యక్తి పిటిషన్‌ విచారణ సందర్భంగా శుక్రవారం ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ‘క్రిమినల్‌ కేసులున్నంత మాత్రాన సదరు వ్యక్తికి పాస్‌పోర్ట్‌ ఉండొద్దని, రెన్యువల్‌ చేయించుకోవద్దని ఏమీ లేదు. సంబంధిత క్రిమినల్‌ కోర్టు అనుమతి, పిలిచినప్పుడల్లా విచారణకు హాజరవుతానని నిందితుని ప్రమాణ పత్రం ఉంటే చాలు’అని స్పష్టం చేసింది. 
 

Videos

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు