Breaking News

Bihar: ‘లేపేస్తామంటూ..’ చిరాగ్‌ పాశ్వాన్‌కు హెచ్చరిక?

Published on Sat, 07/12/2025 - 08:33

పట్నా: బీహారీ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివరిలో జరగనున్నాయి. ఈ నేపధ్యంలో రాజకీయ పార్టీలన్నీ తమ సన్నాహాల్లో మునిగితేలుతూ, దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. ఇంతలో బీహార్‌కు చెందిన కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌ను హత్య చేస్తామంటూ సోషల్ మీడియాలో బెదిరింపులు వచ్చాయని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)వెల్లడించింది.

రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు చోటుచేసుకున్న ఈ పరిణామం సంచలనంగా మారింది. పోలీసులు రంగంలోకి దిగి ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. పార్టీ ప్రతినిధి రాజేష్ భట్ పట్నా సైబర్ పోలీస్ స్టేషన్‌లో చేసిన ఫిర్యాదు ప్రకారం ‘టైగర్ మెరాజ్ ఈడీసీ’ అనే యూజర్‌నేమ్‌తో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ బెదిరింపు వచ్చింది. ఎల్‌జేపీకి నాయకత్వం వహిస్తున్న పాశ్వాన్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించిన అనంతరం ఆయనకు ఈ బెదిరింపు వచ్చింది. పాశ్వాన్‌కు అంతకంతకూ పెరుగుతున్న ప్రజాదరణ నేపధ్యంలో ఈ హెచ్చరిక రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

‘ఈ హెచ్చరిక తీవ్రతను వెంటనే గ్రహించి, సత్వర చర్యలు చేపట్టాలని అభ్యర్థిస్తున్నాను. దయచేసి నిందితుడిని వెంటనే అరెస్టు చేసి, అతనికి కఠినమైన శిక్ష విధించండి’ అని భట్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి ఈ బెదిరింపు వచ్చిందని సైబర్ డీసీపీ నితీష్ చంద్ర ధారియా మీడియాకు తెలిపారు. పట్నా సైబర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. చట్టపరమైన చర్యలు  చేపట్టామని ధరియా పేర్కొన్నారు. బీహార్‌లోని హాజీపూర్‌కు చెందిన కేంద్ర ఆహార ప్రాసెసింగ్ మంత్రి, లోక్‌సభ ఎంపీ చిరాగ్ పాశ్వాన్.. ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల తేదీని భారత ఎన్నికల సంఘం ఇంకా ప్రకటించలేదు.
 

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)