Breaking News

ఇండో-టిబెట్ సరిహద్దులో చైనా పౌరుడు అరెస్ట్‌

Published on Mon, 06/10/2024 - 09:41

హిమాచల్‌ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాలో కలకలం చెలరేగింది. ఇక్కడి ఇండో-టిబెట్ సరిహద్దుకు సమీపంలో స్థానిక పోలీసులు ఒక చైనా పౌరుడిని అరెస్టు చేశారు. ఆ చైనా పౌరుడితో ఒక భారతీయ మహిళ కూడా ఉండటంతో ఆమెను కూడా  కిన్నౌర్ పోలీసులు అరెస్టు చేశారు.

మీడియాకు అందిన సమాచారం ఈ ఘటన కిన్నౌర్ జిల్లా సుమ్డో పోలీసు చెక్ పోస్ట్ దగ్గర చోటుచేసుకుంది. ఇన్నర్ లైన్ పర్మిట్ లేకుండా ఆ చైనా పౌరుడు పోలీసులకు తారసపడ్డాడు. అతనితో పాటు ఉన్న మహిళ అతని భార్య అని, ఆమె మహారాష్ట్రకు చెందినదని పోలీసులు తెలిపారు. ఆ యువకుడిని 35 ఏళ్ల గుయో యుడాంగ్‌గా గుర్తించారు. అతను మహారాష్ట్రకు చెందిన ఆ మహిళను పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరి దగ్గరా వీసాతో సహా వారి వివాహ పత్రాలు ఉన్నాయి.

అయితే కిన్నౌర్ సరిహద్దు ప్రాంతంలోకి ప్రవేశించడానికి వారికి అంతర్జాతీయ ఇన్నర్ లైన్ అనుమతి లేదు. ఇన్నర్ లైన్ పర్మిట్ ఉల్లంఘనపై పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. కిన్నౌర్ పోలీస్ డీఎస్పీ నవీన్ జల్తా ఈ విషయాన్ని ధృవీకరించారు. అయితే ఈ ఘటనపై మరిన్ని వివరాలను వెల్లడించడానికి నిరాకరించారు. ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశమని, అందుకే దీనిపై పెద్దగా ఏమీ చెప్పలేమని డీఎస్పీ తెలిపారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)