Breaking News

భారత్‌కు జిన్‌పింగ్‌.. గాల్వాన్ ఘర్షణ తర్వాత తొలి పర్యటన!

Published on Fri, 07/31/2026 - 13:28

ఢిల్లీ: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ వచ్చే సెప్టెంబర్‌లో భారత్‌లో జరగనున్న బ్రిక్స్ (BRICS) సదస్సుకు హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. సెప్టెంబర్ 12–13 తేదీల్లో న్యూఢిల్లీలో నిర్వహించనున్న ఈ సదస్సులో పాల్గొనేందుకు ఆయన భారత్‌కు రావచ్చని అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ పర్యటనపై భారత్ లేదా చైనా ప్రభుత్వాలు ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు.

షీ జిన్‌పింగ్ భారత్‌కు వస్తే.. 2020 గాల్వాన్ లోయ ఘర్షణ తర్వాత ఆయన చేసే తొలి భారత పర్యటనగా నిలుస్తుంది. చివరిసారిగా ఆయన 2019 అక్టోబర్‌లో భారత్‌ను సందర్శించారు. ఆ తర్వాత తూర్పు లడఖ్‌లో భారత్–చైనా సరిహద్దు ఉద్రిక్తతలు రెండు దేశాల సంబంధాలను దెబ్బతీశాయి. కాగా, జిన్‌పింగ్ పర్యటనకు ముందు భారత్–చైనా మధ్య దౌత్య చర్చలు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ త్వరలో చైనాలో పర్యటించి ఉన్నత స్థాయి సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది.

అలాగే, సరిహద్దు వ్యవహారాలపై వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ (WMCC) సమావేశం, అనంతరం ప్రత్యేక ప్రతినిధుల స్థాయి చర్చలు కూడా జరగనున్నట్లు సమాచారం. ప్రత్యేక ప్రతినిధుల సమావేశంలో భారత్–చైనా సరిహద్దు వివాద పరిష్కారానికి సంబంధించిన అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. సరిహద్దు నిర్వహణ, ఉద్రిక్తతల నివారణ, పరస్పర విశ్వాసం పెంపు వంటి అంశాలపై రెండు దేశాలు ముందడుగు వేయాలని ప్రయత్నిస్తున్నాయి.

మోదీ–షీ భేటీపై ఆసక్తి
షీ జిన్‌పింగ్ బ్రిక్స్ సదస్సుకు హాజరైతే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సమావేశం జరిగే అవకాశముంది. ఈ భేటీలో సరిహద్దు వివాదం, ప్రాంతీయ భద్రత, ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సహకారం వంటి కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశముంది. అయితే, ప్రస్తుతం జిన్‌పింగ్ భారత్ పర్యటనపై అధికారిక ధృవీకరణ లేదు. ఢిల్లీ లేదా బీజింగ్ నుంచి అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే ఈ పర్యటన ఖరారైనట్లు భావించాల్సి ఉంటుంది. 

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)