Breaking News

షికారుకు తీసుకెళ్లి ప్రియురాలి హత్య

Published on Wed, 07/08/2026 - 08:39

కర్ణాటక: అనైతిక బంధాలు ఎలా విషాదాంతమవుతున్నాయో మరోసారి ఈ ఘటన చాటిచెప్పింది. జిల్లాలో జాతీయ రహదారి–948లో జవగనహళ్లి కొండ వద్ద నిర్జన ప్రాంతంలో గత నెల 22న లభించిన కాలిన స్థితిలో మహిళ మృతదేహం మిస్టరీని మళవళ్లి తాలూకా బెళకవాడి పోలీసులు ఛేదించారు. బెంగళూరులోని హారోహళ్లి కగ్గలీపురకు చెందిన నళిని (33)గా గుర్తించారు.  స్థలంలో మహిళ చేతి గడియారం, ఉంగరం, హెయిర్‌ క్లిప్, ఇంటి తాళాలు లభించాయి. 

ఆమె ప్రియుడు తమిళనాడు క్రిష్ణగిరి జిల్లాకు చెందిన ఉప్పారహళ్లి రాజశేఖర్‌ (30) అని తేలింది. నళినికి ఇదివరకే పెళ్లయి విడిపోయింది. బెంగళూరులోని జేపీనగరలో బ్యూటీపార్లర్‌లో పనిచేసేది.  నళినికి ఓ గుడి వద్ద రాజశేఖర్‌తో పరిచయం ఏర్పడి, ప్రేమకు దారి తీసింది. తనను పెళ్లి చేసుకోవాలని నళిని ఒత్తిడి చేయగా, నీకు ఇదివరకే పెళ్లయిందని అతడు నిరాకరించేవాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుండేది. నళిని తీరుతో కక్ష పెంచుకున్న రాజశేఖర్‌ మాయమాటలతో నళినిని గత నెల 22న కారులో షికారుకు తీసుకెళ్లి గొంతు పిసికి చంపి నిప్పంటించి కాల్చి వేశాడు. తర్వాత రెండు రోజులకు మళ్లీ అక్కడకు వెళ్లి కాలిన స్థితిలో శవాన్ని చూసి వెళ్లాడు.   

తల్లితో కలిసి నిందితుని ఆత్మహత్య   
పోలీసుల దర్యాప్తు తీవ్రం కావడంతో భయపడిన రాజశేఖర్‌ గతనెల 28న సాయంత్రం తన తల్లితో కలిసి తమిళనాడులోని ఉప్పారహళ్లి వద్ద కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు అదివరకే అతన్ని విచారించగా తనకేమీ తెలియదని చెప్పాడు. తరువాత నళిని స్నేహితురాలు శ్రేయా వారి ప్రేమ గురించి పోలీసులకు వివరించింది. దీంతో మిస్టరీ వీడింది. అయితే హంతకుడు కూడా చనిపోవడంతో కేసు క్లోజ్‌ చేశారు. ఎస్పీ శోభారాణి, డీఎస్పీ యశ్వంత్, సీఐ శ్రీధర్, ఎస్‌ఐ ప్రకాష్‌ కేసును పర్యవేక్షించారు.      

Videos

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)