Breaking News

ప్రొటోకాల్‌ అనేది విశేషాధికారం కాదు: సీజేఐ

Published on Fri, 07/21/2023 - 13:58

ఢిల్లీ: న్యాయమూర్తుల ప్రొటోకాల్‌ అంశంపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదేం విశేషాధికారం కాదని.. ఆ సౌకర్యాలతో ఇతరులకు ఇబ్బంది కలిగించడమూ సరికాదని, తద్వారా న్యాయవ్యవస్థపై ప్రజల్లో గౌరవమూ తగ్గిపోతుందన్న  అభిప్రాయమూ ఆయన వ్యక్తం చేశారు. ఈ మేరకు పలు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు తన అభిప్రాయంతో కూడిన లేఖలు రాశాయన. 

తీర్పులతోనే కాదు.. ప్రొఫెషనల్‌ ఆటిట్యూడ్‌తోనూ చీఫ్‌ జస్టిస్‌ చంద్రచూడ్‌ తరచూ వార్తల్లో నిలుస్తుండడం చూస్తున్నాం. సుప్రీం కోర్టు కఫేటేరియాను సందర్శించడం, న్యాయస్థానం కార్యాలయాల పని తీరుతో పాటు అక్కడ పని చేసే వాళ్ల పోస్టుల పేర్లను మార్చాలని(పారిశుద్ధ్య కార్మికులతో సహా) ప్రతిపాదించడం లాంటి చర్యలతో ప్రశంసలు అందుకున్నారాయన. ఈ క్రమంలో.. 

తాజాగా ఓ హైకోర్టు న్యాయమూర్తి తనకు రైలు ప్రయాణంలో ఎదురైన ఇబ్బందికర అనుభవం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. సదరు రీజినల్‌ రైల్వే మేనేజర్‌ నుంచి కోర్టు రిజిస్ట్రార్‌ ద్వారా వివరణ కోరడం తెలిసే ఉంటుంది. ఈ పరిణామంపై స్పందించే క్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌.. పలు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు లేఖలు రాశారు. 

రైల్వే సిబ్బందిపై హైకోర్టుకు “క్రమశిక్షణా పరిధి’’ ఉండదని అని సీజేఐ డీవై చంద్రచూడ్ లేఖల్లో న్యాయమూర్తులకు గుర్తు చేశారు. అలాగే.. ప్రొటోకాల్‌ అనేది విశేషాధికారం కాదన్న విషయం గుర్తుంచుకోవాలని సూచించారాయన. ఈ క్రమంలో న్యాయవ్యవస్థలో స్వీయ ప్రతిబింబం,  కౌన్సెలింగ్ అవసరమంటూ అభిప్రాయపడ్డారాయన. 

‘‘న్యాయమూర్తులు తమకు అందుబాటులో ఉన్న ప్రొటోకాల్‌ సౌకర్యాలు ఉపయోగించుకోవడంలో తప్పు లేదు. కానీ, ఆ సమాజం నుంచి వాళ్లను వేరే చేసే విధంగా.. లేదంటే తమను తాము ప్రత్యేక వ్యక్తిగా చూపించుకునే ప్రయత్నం చేయకూడదు. కోర్టుల్లోనే కాదు.. బయటా న్యాయపరమైన అధికారాన్ని తెలివిగా అమలు చేయాలి. తద్వారా న్యాయవ్యవస్థపై విశ్వసనీయత,  చట్టబద్ధతను.. అలాగే న్యాయమూర్తుల సమాజ గౌరవం నిలబడుతుంది. 

అంతేగానీ.. ఆ సౌకర్యాలతో ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు. అలాగే.. న్యాయవ్యవస్థపై బహిరంగ విమర్శలు చేసేందుకు దారి తీయకూడదు. నా ఈ అభిప్రాయాలను తెలియజేస్తున్నానని.. ఇక మీ అభిప్రాయాలను తనతో పంచుకోవాల’’ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను కోరారాయన. 

అలహాబాద్‌ హైకోర్టు జడ్జి గౌతమ్‌ చౌదరి తాజాగా రైలు ప్రయాణంలో ఇబ్బంది ఎదుర్కొన్నారు. తన భార్యతో కలిసి పురుషోత్తం ఎక్స్‌ప్రెస్‌లో న్యూఢిల్లీ నుంచి ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్న సమయంలో ఆయనకు చేదు అనుభవం ఎదురైందట. రైలు ఆలస్యంతో పాటు సమయానికి భోజనం దొరక్కపోవడం లాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారట.  ఆ సమయంలో ఆయన రైల్వే పోలీసులు, రైల్వే సిబ్బంది నుంచి బదులు కోసం చూడగా.. ఫలితం లేకుండా పోయిందట. 

దీంతో న్యాయమూర్తి అనే తన గౌరవానికి భంగం వాటిల్లిందటూ ఆయన ప్రయాగ్‌రాజ్‌లోని నార్త్‌ సెంట్రల​ రైల్వే జోన్‌ జనరల్‌ మేనేజర్‌ను వివరణ కోరుతూ హైకోర్టు రిజిస్ట్రార్‌ ద్వారా లేఖ పంపించారు. 

ఇదీ చదవండి: ఇదేంది ఇది.. 100 పేజీల తీర్పు కాపీనా?

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)