Breaking News

చక్కని బైకుంది.. పక్కన పిల్ల ఉంది.. సినిమాను మించిన ట్విస్ట్‌లు

Published on Thu, 08/14/2025 - 16:53

రాయ్‌పూర్: ప్రియుడికి బైక్‌ కొనివ్వడానికి ప్రియురాలు దొంగగా మారిపోయింది. బంధువుల ఇంటిని దోచేసింది. ఈ ఘటన ఛత్తీస్‌గడ్‌లోని కాంకేర్ జిల్లాలో సంచలనం రేపుతోంది. ప్రియుడు విశ్వకర్శకు బైక్ కొనివ్వడానికి ప్రియురాలు కరుణ పటేల్‌ పక్కా ప్లాన్‌ చేసింది.  తాళం వేసి ఉన్న బంధువుల ఇంటికి ప్రియుడిని తీసుకెళ్లి రూ.2 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు రూ.95 వేలు నగదును చోరి చేసింది. ఇంటి యాజమాని కన్హయ్య పటేల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విచారణ చేపట్టిన పోలీసులు.. ప్రియుడు, ప్రియురాలిని అదుపులోకి తీసుకున్నారు. కాంకేర్ జిల్లా జైలుకు తరలించి విచారణ చేశారు. విచారణలో కరుణ పటేల్‌ అసలు విషయం బయటపెట్టింది. ప్రియుడికి బైక్‌ కొనడం కోసమే ఈ పనిచేసినట్లు ప్రియురాలు చెప్పింది. బైక్ కోసం తన ప్రియుడికి డబ్బు ఇచ్చి, ఆభరణాలను తన వద్దే ఉంచుకున్నట్లు పోలీసులకు తెలిపింది.

కన్హయ్య పటేల్ సోమవారం మధ్యాహ్నం పని కోసం మార్కెట్‌కు వెళ్లగా.. ఆ రాత్రి తిరిగి వచ్చిన తర్వాత, అతని ఇంటి తాళం పగలగొట్టి, గదులు దోచుకున్నారని. అదనపు ఎస్పీ దినేష్ సిన్హా మీడియాకు తెలిపారు.

 

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)