Breaking News

జీరాం వ్యాలీ మావోయిస్టు దాడి.. 10 మందికి మరణశిక్ష

Published on Wed, 09/16/2026 - 19:42

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: పది మంది మావోయిస్టులకు మరణ శిక్ష విధిస్తూ నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దేశవ్యాప్తంగా సంచలం సృష్టించిన జిరాంఘాటీ దాడి కేసులో ఈ తీర్పు వెలువరించింది. 2013 మే 25న కాంగ్రెస్‌ నేతలు భారీ కాన్వాయ్‌తో ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా దర్భ లోయలో ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. జిరామ్‌ ఘాటీలో ఈ కాన్వాయ్‌పై మావోయిస్టులు మెరుపుదాడి చేశారు. ఈ ఘటనలో మొత్తం 27 మంది చనిపోగా, 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో కాంగ్రెస్‌ అగ్రనేతలైన పీసీసీ చీఫ్‌ నందకుమార్‌ పటేల్, మాజీ కేంద్రమంత్రి విద్యాచరణ్‌ శుక్లా, సల్వాజుడుం సృష్టికర్త మహేంద్రకర్మతో పాటు పోలీసులు, భద్రతా సిబ్బంది ఉన్నారు.  

ఏళ్ల విచారణ 
జిరామ్‌ ఘాటీ ఘటనపై ఐపీసీ, సాయుధ చట్టం, పేలుడు పదార్థాల చట్టం, ఉపా చట్టాల్లోని 24 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. విచారణను ఎన్‌ఐఏ చేపట్టింది. వెనువెంటనే సమీప ప్రాంతాల్లో గాలింపు చేపట్టగా, మావోయిస్టు పార్టీకి సంబంధించిన కిందిస్థాయి దళ సభ్యులు, కార్యకర్తలను పదుల సంఖ్యలో అరెస్ట్‌ చేశారు. ఆ తర్వాత తొమ్మిది మందిని నిందితులుగా పేర్కొంటూ తొలి చార్జ్‌ïÙట్‌ను 2014 సెప్టెంబర్‌ 25న దాఖలు చేసింది. దీనికి అదనంగా మరో 30 మందిని చేరుస్తూ మలి చార్జ్‌షిట్‌ను 2015 సెపె్టంబర్‌ 28న దాఖలు చేసింది. అప్పటి నుంచి విచారణ కొనసాగుతోంది. మొత్తంగా 101 మంది సాక్షులను విచారించి, 11 మందిని ఈనెల 5న కోర్టు దోషులుగా ప్రకటించింది. వీరికి విధించిన శిక్ష వివరాలను జగ్‌దల్‌పూర్‌లో ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు బుధవారం వెల్లడించింది. మరణశిక్షపై 30 రోజుల్లోగా హైకోర్టులో అప్పీలు చేసుకోవచ్చని తెలిపింది. 

మరణశిక్ష పడ్డ మావోయిస్టులు 
జిరామ్‌ ఘాటీ కేసులో మొడియం ప్రమీల, చైతూ లేకం అలియాస్‌ మున్నా, సుమితా, ముక్కా మడ్వి, కోసా కవాసీ, ఆయటామక్రం, మడకం దేవా, జోగా మడ్‌కమీ, బంజామి సన్నా, మహదేవ్‌ ఉన్నారు. కోర్టు దోషులుగా తేలి్చన మరో మావోయిస్టు జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నప్పుడు మరణించాడు.  

విభిన్న స్పందనలు 
ఎన్‌ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పును ఛత్తీస్‌గఢ్‌ సీఎం విష్ణుదేవ్‌సాయ్, హోంమంత్రి విజయ్‌శర్మ న్యాయం గెలిచినట్టుగా అభివరి్ణంచారు. జిరామ్‌ఘాటీ లాంటి అనేక దారుణమైన హింసాత్మక ఘటనలకు గతంలో మావోయి స్టులు పాల్పడ్డారని, ఆ చేదు జ్ఞాపకాలు ఇప్ప టికీ వెంటాడుతున్నాయన్నారు. ఈ తీర్పు న్యాయవ్యవస్థపై నమ్మకం పెంచిందన్నారు. ఇదే సమయాన కాంగ్రెస్‌ పార్టీ భిన్నంగా స్పందించింది. మావో అగ్రనేతల సూచనలు లేకు ండా జిరామ్‌ఘాటీ లాంటి ఘటనలు చోటు చేసుకోవని, పైస్థాయి మావోయిస్టులను వదిలేసి కేవలం కింది స్థాయి వారిని అరెస్ట్‌ చేసి, వారికే మరణ శిక్ష విధించారని పేర్కొంది. తద్వారా ఘటనలో చనిపోయిన వారి ఆత్మలు శాంతించవంది. తమ యాత్రకు సరైన భద్రత కలి్పంచలేని అప్పటి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని పక్కదారి పట్టించారని ఆరోపించింది. దీనికితోడు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న కీలక నేతల పేర్లను తర్వాత ఎందుకు తొలగించారని కాంగ్రెస్‌ మాజీ సీఎం భూపేష్‌ బగేల్‌ ప్రశ్నించా రు. ఇంకా విచారణ కొనసాగుతుందన్నారు.

టార్గెట్‌ మహేంద్ర కర్మ.. ప్లాన్‌ చేసింది బస్వరాజు 
దేశంలో ఉన్న ప్రధాన సాయుధ కమ్యూనిస్టు గ్రూపులు 2004 సెపె్టంబరు 21న సీపీఐ (మావోయిస్టు)గా ఆవిర్భవించాయి. వీరికి వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే స్థానిక ఆదివాసీ నేత మహేంద్రకర్మ (మహేంద్ర కల్మా) నేతృత్వంలో స్థానిక ఆదివాసీలతో సల్వాజుడుం (శాంతి దళం) 2005లో ఏర్పాటు చేశారు. సరైన శిక్షణ లేకుండానే వీరి చేతికి ఆయుధాలు ఇచ్చి మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లోకి స్పెషల్‌ పోలీస్‌ ఆఫీసర్లుగా పంపారు. 

దీంతో 2005 నుంచి 2011 వరకు మావోయిస్టులు వారి సానుభూతిపరులు, సల్వాజుడుం, మద్దతుగా ఉన్న ప్రభుత్వ విభాగాల మధ్య తీవ్ర ఘర్షణ ఏర్పడింది. ఇరు వర్గాలు దాడులు చేసుకున్నాయి. గ్రామాలను తగలబెట్టారు. మహిళలు, బాలలపై విపరీతమైన హింస చోటు చేసుకుంది. చివరకు సుప్రీంకోర్టు తీర్పుతో సల్వాజుడుం 2011లో రద్దయింది. ఈ సల్వాజుడుం సృష్టికర్తగా పేరున్న మహేంద్ర కర్మ మావోయిస్టుల ప్రధాన టార్గెట్‌ అయ్యారు. దీంతో అప్పటి మావోయిస్టు పార్టీ సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌ చీఫ్‌గా ఉన్న నంబాల కేశవరావు అలియాస్‌ బస్వరాజ్‌ నేతృత్వంలో దాడికి వ్యూహ రచన జరిగింది. 200 మందికి పైగా మావోయిస్టులు ఈ దాడిలో పాల్గొన్నారు. 

జిరామ్‌ ఘాటీలో ఇరుకైన మూలమలుపు దగ్గరకు రాగానే ముందుగా ల్యాండ్‌మైన్‌ పేల్చారు. కాన్వాయ్‌ ఆగిపోగానే ఒక్కసారిగా నలువైపుల నుంచి తూటాల వర్షం కురిపించారు. మహేంద్ర కర్మను వాహనం నుంచి బయటకు లాగి గొడ్డళ్లతో నరికారు. అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న సమయాన ఛత్తీస్‌గఢ్‌ పీసీసీ చీఫ్‌తోపాటు మాజీ కేంద్ర మంత్రి చనిపోవడంతో కేసు సంచలనంగా మారింది. ఎఫ్‌ఐఆర్‌లో ఇటీవల కాలంలో లొంగిపోయిన, ఎన్‌కౌంటర్లలో చనిపోయిన కొందరు అగ్రనేతల పేర్లు ఉన్నాయి. తర్వాత కాలంలో ఆ పేర్లు లేకుండా పోయాయి. బస్తర్‌లో మారిన పరిస్థితులకు ఈ కేసు ఓ ఉదాహరణగా నిలిచింది.  

Videos

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

చంద్రబాబుపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్

అప్పిరెడ్డికి భద్రత కూడా కల్పించలేమన్న జైలు అధికారులు

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బర్త్ డే సెలెబ్రేషన్స్

రామాయణ రికార్డుల జాతర

రామాయణం చిత్రంపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర పోస్ట్

బంగారం కొనాలా? వద్దా? రానున్న 15 రోజుల్లో ఏం జరగబోతుందంటే?

జైల్లోలేళ్ల అప్పి రెడ్డిని పరామర్శించిన అంబటి రాంబాబు

YSRCP ఏజెంట్లపై TDP నేతల దాడి.. రమేష్ గౌడ్ పరామర్శ

అత్తను పెండ్లి చేసుకున్న అల్లుడు

Photos

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)

+5

19 ఏళ్లకొకసారే ఇలా.. మంజుల బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

శ్రీకాంత్ కూతురిని చూశారా? ఎలా మెరిసిపోతోందో? (ఫొటోలు)

+5

జపాన్‌లో అత్తమామలతో కలిసి రష్మిక సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ సెలబ్రిటీస్ ఇంట్లో సందడిగా దీపావళి వేడుకలు (ఫొటోలు)

+5

బర్త్ డే ప్లస్ దీపావళి.. ఫ్యామిలీతో అనసూయ సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దివాళి ఫొటోలు పంచుకున్న భూమిక, ప్రగ్యా జైస్వాల్ (ఫొటోలు)

+5

దివాళి వేళ.. అనుపమ (ఫోటోలు)

+5

జాన్వీ ప్లాన్ చేసిన ఖుషి కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)