Breaking News

ఛత్తీస్‌గఢ్‌: 13 ఏళ్లలో 11 నక్సల్‌ ఘాతుకాలు!

Published on Wed, 01/31/2024 - 11:04

ఛత్తీస్‌గఢ్‌లో సాధారణ జనజీవనానికి నక్సలైట్లు విఘాతం కలిగిస్తుంటారు. ఆ రాష్ట్రంలో నక్సలైట్ల దాడులకు సంబంధించిన వార్తలు తరచూ వినిపిస్తుంటాయి. ఇటీవల జరిగిన ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నక్సలైట్లు దాడులకు పాల్పడ్డారు. తాజాగా నిన్న (జనవరి 30)న ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్లు దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు ఆర్మీ జవాన్లు వీరమరణం పొందారు.

ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్ల సమస్య ఈనాటిది కాదు. 2023 ఏప్రిల్ 26న నక్సలైట్ల దాడిలో 10 మంది డీఆర్‌జీ సైనికులు వీరమరణం పొందారు. ఛత్తీస్‌గఢ్‌లో  నక్సలైట్ల భారీ దాడి 2010 ఏప్రిల్ 6న జరిగింది. ఈ ఘటనలో 76 మంది సైనికులు వీరమరణం పొందారు. ఈ దాడితో దేశం మొత్తం ఉలిక్కిపడింది.

నక్సలైట్ల దాడిలో సామాన్యులు, ఆర్మీ సిబ్బంది మాత్రమే కాదు, ఒకప్పుడు నక్సలైట్ల దాడిలో పలువురు రాజకీయ నేతలు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన 2023, మే 25న జరిగింది. ఆ రోజున జీరం వ్యాలీలో నక్సలైట్లు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో పలువురు కాంగ్రెస్ నేతలతో సహా 30 మంది ప్రాణాలు కోల్పోయారు.

2014, ఏప్రిల్ 12న ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో నక్సలైట్లు జరిపిన దాడిలో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు. 2015 ఏప్రిల్‌లో ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడలో జరిగిన నక్సలైట్ల దాడిలో నలుగురు జవాన్లు వీరమరణం పొందారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి, సామాన్యులకు నక్సలైట్లు ఎప్పుడూ ఇబ్బందులు సృష్టిస్తూనే ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తుంటాయి. 

2010 నుంచి నక్సల్స్‌ భారీ ఘాతుకాలు

2023, ఏప్రిల్‌ 26 
దంతెవాడలో జరిగిన దాడిలో 40 మంది జవాన్లు వీరమరణం పొందారు.

2021, ఏప్రిల్‌
బీజాపూర్, సుక్మా సరిహద్దుల్లో 22 మంది సైనికులు వీరమరణం పొందారు.

2020, మార్చి 
సుక్మాలో జరిగిన దాడిలో 17 మంది సైనికులు అమరులయ్యారు.

2017, ఏప్రిల్ 24
సుక్మాలో జరిగిన దాడిలో 25 మంది సైనికులు వీరమరణం పొందారు.

2017, మార్చి 11 
సుక్మాలో జరిగిన దాడిలో 12 మంది జవాన్లు వీరమరణం పొందారు.

2017, మార్చి
దంతెవాడలో జరిగిన దాడిలో ఏడుగురు జవాన్లు వీరమరణం పొందారు. 

2015, ఏప్రిల్ 
దంతెవాడలో జరిగిన దాడిలో నలుగురు జవాన్లు వీరమరణం పొందారు.

2014, ఏప్రిల్‌ 12
జీరం వ్యాలీలో జరిగిన దాడిలో 14 మంది సైనికులు వీరమరణం పొందారు.

2013, మే 25  
జీరం వ్యాలీలో జరిగిన దాడిలో కాంగ్రెస్‌ నేతలు సహా 30 మందికిపైగా మృతి.

2010, ఏప్రిల్‌ 6
దంతెవాడలో జరిగిన దాడిలో 76 మంది సైనికులు వీరమరణం పొందారు.

Videos

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)