Breaking News

సెల్‌ఫోన్‌ కోసం గొడవ.. యువతిని రైలు నుంచి తోసేయడంతో

Published on Sun, 07/09/2023 - 13:42

సాక్షి, చెన్నై: చైన్నె కందన్‌చావడి, తిరువిక వీధికి చెందిన శశి కుమార్‌ కుమార్తె ప్రీతి(22).. కొట్టూరుపురంలోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తోంది. ఆమె ఈనెల 2వ తేదీ సాయంత్రం, పని ముగించుకుని, సబర్బన్‌ రైలులో ప్రయాణించింది. ఆ సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ప్రీతి వద్ద సెల్‌ఫోన్‌ లాక్కోవడానికి యత్నించారు. ఈ సమయంలో వారితో గొడవపడింది.

రైలు ఇందిరా నగర్‌ స్టేషన్‌ సమీపంలోకి రాగానే కోపోద్రిక్తులైన ఇద్దరు వ్యక్తులు ప్రీతీని కిందకు నెట్టారు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. తోటి ప్రయాణికులు, రైల్వే పోలీసులు ఆమెను రాయపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె శనివారం ఉదయం మృతి చెందింది.

కూతురు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. దీంతో తిరువాన్ముయూర్‌ రైల్వే పోలీసులు ఇందిరా నగర్‌ రైల్వేస్టేషన్‌ సహా ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాల రికార్డులను పరిశీలించారు. ఈ నేపథ్యంలో పట్టి నపాక్కంకు చెందిన విఘ్నేష్‌ (27), అడియార్‌కు చెందిన మణిమారన్‌ (26) నిందితులుగా గుర్తించి అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: అంతు చిక్కని మిస్టరీ..మార్లిన్‌ శాంటానా మూడు రోజుల పాప కథ..

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)