Breaking News

ఆత్మరక్షణ కోసమే మామ హత్య

Published on Fri, 07/03/2026 - 13:50

తమిళనాడు: పల్లావరం సమీపం అనకాపుత్తూరు, కస్తూరిబాయి నగర్‌ లో నివసించే పెరుమాళ్‌ (58) చేపల వ్యాపారం చేసేవాడు. మూడు నెలల క్రితం అనారోగ్యంతో అతని కుమారుడు మరణించాడు. దీని తరువాత, కోడలు తన 8 ఏళ్ల కుమార్తె, 4 ఏళ్ల కుమారుడితో కలిసి తన మామ పెరుమాళ్, అత్తగారితో నివసిస్తోంది.

 ఆ మహిళ అత్త రెండు రోజుల క్రితం కాంచీపురంలోని తన బంధువుల ఇంటికి వెళ్లింది. దీంతో పెరుమాళ్, అతని కోడలు తమ పిల్లలతో ఇంట్లోనే ఉన్నారు. ఈ స్థితిలో, బుధవారం పెరుమాల్‌ తన పిల్లలతో కలిసి గదిలో ఒంటరిగా నిద్రిస్తున్న కోడలిని లైంగికంగా వేధించి, ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఆ మహిళ దీనిని అడ్డుకోవడానికి ప్రయత్నించి, కోపం తో అక్కడే ఉన్న  కత్తితో పెరుమాల్‌ మెడపై  పొడిచింది. ఈ దాడిలో పెరుమాల్‌ అక్కడికక్కడే మరణించాడు. ఈ విషయం శంకర్‌ నగర్‌ పోలీసుల విచారణలో పెరుమాళ్‌ను అతని కోడలే కత్తితో పొడిచి చంపినట్లు తేలింది.

మామను చంపిన తర్వాత కోడలు ఇంటి నుండి బయటకు వచ్చి, అతను తనతో అసభ్యంగా ప్రవర్తించడానికి యత్నించినందునే చంపినట్లు ఇరుగుపొరుగు వారికి చెప్పింది. పోలీసులకు తనను అప్పగించమని కోరింది. తన పిల్లలను జాగ్రత్తగా చూసుకోమని  కోరినట్లు తెలుస్తోంది. తనతో అసభ్యంగా ప్రవర్తించడానికి యత్నించిన వ్యక్తి నుండి తప్పించుకునే క్రమంలో ఆత్మరక్షణ చర్యగా ఈ హత్య పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈమేరకు ఆ మహిళను అరెస్టు చేయకుండా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.

ఇంట్లో ఒంటరిగా ఉన్న కోడలిపై మామ దుర్మార్గం..!

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)