Breaking News

అయ్యప్ప భక్తుల కోసం చెంగన్నూర్ రైల్వే స్టేషన్‌ ముస్తాబు!

Published on Tue, 11/03/2026 - 09:01

చెంగన్నూర్: శబరిమల వార్షిక తీర్థయాత్ర సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో కేరళలోని చెంగన్నూర్ రైల్వే స్టేషన్‌లో అభివృద్ధి, మరమ్మతు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు దాదాపు 60 శాతం పనులు పూర్తయ్యాయి. యాత్ర ప్రారంభానికి కేవలం రెండు వారాల సమయం మాత్రమే ఉండటంతో మిగిలిన పనులను పూర్తి చేసేందుకు అధికారులు పరుగులు పెడుతున్నారు. అయితే అడపాదడపా కురుస్తున్న వర్షాలు పనులకు ఆటంకంగా మారుతున్నాయి. ఈ పనులకు సుమారు రూ.50 లక్షలు ఖర్చు చేస్తున్నారు.

స్టేషన్ పార్కింగ్ ప్రదేశంలో రోడ్డు పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. ప్రవేశ ప్రాంగణంలో తారు రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. స్టేషన్‌కు రంగులు వేయడంతోపాటు ప్లాట్‌ఫారాలపై వర్షపు నీరు కారకుండా పైకప్పులకు మరమ్మతులు చేస్తున్నారు. భారీ నిర్మాణ సామగ్రిని తరలించేందుకు వీలుగా ప్లాట్‌ఫామ్ నంబర్ 1 సమీపంలోని దెబ్బతిన్న ప్రహరీ గోడను తొలగించి తాత్కాలిక మార్గాన్ని ఏర్పాటు చేశారు. వెయిటింగ్ హాళ్లలోని మరుగుదొడ్లను ఆధునిక సౌకర్యాలతో పునరుద్ధరిస్తున్నారు. పాత టైల్స్, ఇతర పరికరాలను తొలగించి కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు.

యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని స్టేషన్ ప్రాంగణంలో అదనపు లైట్లు, సీలింగ్ ఫ్యాన్లను ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు రైల్వే స్టేషన్, మున్సిపల్ కార్యాలయం మీదుగా వెళ్లే ప్రధాన డ్రైనేజీ కాలువ మరమ్మతులపై పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ దృష్టి సారించింది. కాలువపై ఉన్న కాంక్రీట్ పలకలను తొలగించి పూడిక తీశారు. అయితే రైల్వే స్టేషన్ సరిహద్దు వద్ద కాలువలో ఇంకా కొంత భాగం పూడికతో నిండిపోయి ఉంది. ఈ ప్రాంతాన్ని కూడా త్వరలోనే శుభ్రం చేసేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: భారత నౌకాదళం మెరుపు ఆపరేషన్.. 20 మందికి విముక్తి!

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)