Breaking News

చంపై సోరెన్‌ను ‘జార్ఖండ్‌ టైగర్‌’ అని ఎందుకంటారు?

Published on Thu, 02/01/2024 - 07:07

చంపై సోరెన్‌ జార్ఖండ్ తదుపరి ముఖ్యమంత్రి కానున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాజీనామా నిర్ణయం తర్వాత జార్ఖండ్ ముక్తి మోర్చా .. చంపై సోరెన్‌ తదుపరి ముఖ్యమంత్రి అని ప్రకటించింది. చంపై.. హేమంత్ సోరెన్‌కు దగ్గరి బంధువని చెబుతారు. చంపై ప్రస్తుతం రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జేఎంఎంతో పాటు కాంగ్రెస్ కూడా ప్రభుత్వంలో మిత్రపక్షంగా ఉంది. చంపై సోరెన్‌ ‘జార్ఖండ్‌ టైగర్‌’గా పేరొందారు. 

చంపై సోరెన్ జార్ఖండ్ శాసనసభ సభ్యుడు. ప్రస్తుతం ఆయన జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ నుంచి సెరైకెలా అసెంబ్లీ స్థానానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. చంపై క్యాబినెట్ మంత్రిగా హేమంత్ సోరెన్ ప్రభుత్వంలో రవాణా, షెడ్యూల్డ్ తెగలు,షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

బీహార్ నుండి ప్రత్యేక జార్ఖండ్ రాష్ట్రం కోసం డిమాండ్ వచ్చినప్పుడు చంపై పేరు వార్తల్లో నిలిచింది. శిబు సోరెన్‌తో పాటు చంపై కూడా జార్ఖండ్‌ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. అప్పటి నుంచి రాష్ట్ర ప్రజలు చంపైని ‘జార్ఖండ్ టైగర్’ అని పిలవడం ప్రారంభించారు.

చంపై 2005లో తొలిసారిగా జార్ఖండ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2009లో కూడా ఎమ్మెల్యే అయ్యారు. సెప్టెంబర్ 2010 నుండి జనవరి 2013 వరకు సైన్స్ అండ్ టెక్నాలజీ, లేబర్, హౌసింగ్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. చంపై.. జూలై 2013 నుండి డిసెంబర్ 2014 వరకు ఆహార, పౌర సరఫరాలు, రవాణా కేబినెట్ మంత్రిగా వ్యవహరించారు.

2014లో జార్ఖండ్ అసెంబ్లీకి మూడోసారి ఎన్నికయ్యారు. 2019లో నాలుగోసారి ఎమ్మెల్యే అయ్యారు. దీనితో పాటు హేమంత్ ప్రభుత్వంలో రవాణా, షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

అక్రమ భూ కుంభకోణం కేసులో చిక్కుకున్న హేమంత్ సోరెన్ బుధవారం జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ నేపధ్యంలో జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) కాంగ్రెస్ కూటమి సోరెన్ ప్రభుత్వంలో శాసనసభా పక్ష నేతగా రవాణా మంత్రి చంపై సోరెన్‌ను ఎన్నుకున్నాయి. హేమంత్ సోరెన్‌కు చంపై అత్యంత సన్నిహితుడని చెబుతారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)