Breaking News

పాన్‌ మసాలా తయారీ యూనిట్లపై సెస్‌

Published on Sat, 12/06/2025 - 07:06

న్యూఢిల్లీ: ప్రతిపాదిత హెల్త్‌ అండ్‌ నేషనల్‌ సెక్యూరిటీ సెస్‌ బిల్లులో పాన్‌ మసాలా తయారీ యూనిట్లపై పన్ను విధిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం లోక్‌సభలో ప్రకటించారు. ఈ పన్ను ఆదాయాన్ని రాష్ట్రాలతో పంచుకుంటామని, ఆరోగ్య పథకాల కోసం వెచ్చిస్తామని తెలిపారు. హెల్త్‌ అండ్‌ నేషనల్‌ సెక్యూరిటీ సెస్‌ బిల్లు–2025పై చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడారు. 

ప్రత్యేక ప్రయోజనాల కోసం సెస్‌ విధించేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 270 వీలు కల్పిస్తోందని చెప్పారు. అనంతరం బిల్లును లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. పాన్‌ మసాలా, అలాంటి ఉత్పత్తులను తయారు చేసేందుకు వినియోగించే యంత్రాలు, వాటి సామర్థ్యం ఆధారంగా విధించే సెస్‌ ద్వారా వచ్చే ఆదాయాన్ని జాతీయ భద్రత, ప్రజారోగ్యం కోసం వినియోగించుకునేందుకు ఈ బిల్లులో ఏర్పాటుంది. గతంలోనూ ఇలా సెస్‌లను వివిధ వనరులపై ప్రభుత్వాలు విధించాయన్నారు. 

1974 నుంచి క్రూడాయిల్‌పై సెస్, 2001 నుంచి నేషనల్‌ కెలామిటీ కంటింజెంట్‌ డ్యూటీ, 2000 నుంచి రోడ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సెస్‌ పేరుతో పన్ను వసూలు చేస్తున్న చరిత్ర ఉందన్నారు. పాన్‌ మసాలా చౌకగా మారడానికి, అదే సమయంలో ఆదాయాన్ని కోల్పోయేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని ఆమె తెలిపారు. వినియోగం ఆధారంగా పాన్‌ మసాలాపై గరిష్టంగా 40 శాతం మేర జీఎస్టీ ఉంటుందని చెప్పారు. అయితే, జీఎస్టీ ఆదాయంపై ఈ సెస్‌ ఎటువంటి ప్రభావం చూపదని ఆమె స్పష్టం చేశారు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)