Breaking News

మీరు ఎందుకు రాలేదు.. ఏం చర్యలు తీసుకున్నారు?: కేంద్రం

Published on Sun, 03/08/2026 - 17:12

న్యూఢిల్లీ:  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పశ్చిమ బెంగాల్‌ పర్యటనకు సంబంధించి సరైన ఏర్పాట్లు చేయకపోవడం కేంద్రం తీవ్ర ఆగ్రహం‍ వ్యక్తం చేసింది. రాష్ట్రానికి రాష్టపతి వస్తే.. ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ కనీసం పట్టించుకోరా అంటూ మండిపడింది. దీనికి సమాధానం చెప్పాలంటూ రాష్ట్ర  చీఫ్‌ సెక్రటరీ నందిని చక్రవర్తిని కేంద​ హోం సెక్రటరీ గోవింద్‌ మోహన్‌ వివరణ కోరారు.  

సాధారణంగా రాష్ట్రపతి ఒక రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి, మంత్రులు స్వాగతం పలకడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ముర్ముకు రాష్ట్రం నుంచి ఎటువంటి స్వాగతం కానీ ఆహ్వానం కానీ లభించలేదు. దీన్నే కేంద్రం ప్రధానంగా ప్రస్తావించింది. 

ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి, పోలీసు డైరెక్టర్ జనరల్‌లు.. రాష్ట్రపతిని ఆహ్వానించడానికి కానీ వీడ్కోలు చెప్పడానికి కానీ ఎందుకు హాజరు కాలేదు? రాష్ట్రపతి కోసం ఏర్పాటు చేసిన వాష్‌రూమ్‌లో నీరు లేదు 3)  రాష్ట్రపతి వచ్చే మార్గం చెత్తతో నిండి ఉంది 4) డార్జిలింగ్ జిల్లా మేజిస్ట్రేట్, సిలిగురి పోలీసు కమిషనర్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ బాధ్యులు. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు. దీనికి ఐదు గంటల్లోగా సమాధానం చెప్పండి’ అంటూ  కేంద​ హోం సెక్రటరీ గోవింద్‌ మోహన్‌ ఆదేశించారు.

అదొక ప్రైవేట్‌ ఆర్గనైజేషన్‌: సీఎం మమతా
సిలిగురిలో జరిగిన 9వ అంతర్జాతీయ ఆదివాసీ సంతల్ సమావేశానికి గౌరవనీయులైన రాష్ట్రపతిని ఆహ్వానించారు. అంతర్జాతీయ సంతల్ కౌన్సిల్ అనేది ప్రైవేట్‌ ఆర్గనైజేషన్‌.  ఈ కార్యక్రమం ఏర్పాట్లకు సిబ్బంది తగినంత లేరని జిల్లా యంత్రాంగం రాష్ట్రపతి కార్యాలయానికి  లిఖిత పూర్వకంగా తెలియజేసింది. ఫోన్‌ ద్వారా కూడా తెలియజేశాం. 

గౌరవనీయులైన రాష్ట్రపతిని మేయర్ సిలిగురి మున్సిపల్ కార్పొరేషన్, డిఎం డార్జిలింగ్   సిలిగురి పోలీస్ కమిషనరేట్ స్వాగతించి, వీడ్కోలు పలికారు. రాష్ట్రపతి సచివాలయం ఆమోదించిన లైనప్ ప్రకారం ఇది జరిగింది.  ఈ లైనప్‌లో ‍కానీ వేదిక ప్రణాళికలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి భాగం కాలేదు. జిల్లా యంత్రాంగం వైపు నుండి ఎటువంటి ప్రోటోకాల్ ఉల్లంఘన జరగలేదు’ అని మమతా ట్వీట్‌ చేశారు. 

కాగా, 9వ అంతర్జాతీయ సంతల్ సదస్సులో పాల్గొనడానికి సిలిగురికి వచ్చిన తనకు.. ముఖ్యమంత్రి నుంచి, రాష్ట్ర  మంత్రుల  నుంచి కూడా తనకు ఆహ్వానం అందలేదన్నారు ముర్ము. ‘మమత నా చెల్లెలు లాంటిది. బహుశా ఆమె కోపంగా ఉండవచ్చు.  నేను బెంగాల్‌ పర్యటనకు వస్తే ఆమె నన్ను పట్టించుకోలేదు. సంతాల్‌ దివస్‌కు సరైన ఏర్పాట్లు చేయలేదు.  ఆ కార్యక్రమానికి మమత హాజరు కాకపోవడం నన్ను బాధించింది.

ఆమె అంతర్జాతీయ కార్యక్రమాన్ని ఇంత ఇరుకైన ప్రదేశంలో నిర్వహించాలని ఎంచుకుందో నాకు తెలియదు. వేదిక పెద్దదిగా ఉంటే, సమావేశానికి ఎక్కువ మంది హాజరయ్యేవారు అని ఆమె బిధాన్‌నగర్‌లో జరిగిన మరో కార్యక్రమంలో స్పష్టం చేశారు.. బిధాన్‌నగర్‌లో సమావేశం జరిగి ఉంటే ఐదు లక్షల మంది సులభంగా హాజరయ్యేవారని కూడా ముర్ము ప్రధానంగా  ప్రస్తావించారు.

రాష్ట్రపతితో రాజకీయాలు సరికాదు
రాష్ట్రపతితో కూడా రాజకీయాలు చేయాలనుకోవడం సరైనది కాదని ప్రధాని మోదీ నిన్ననే(శనివారం, మార్చి 7వ తేదీ) ఆగ్రహం వ్యక్తం చేశారు.  బెంగాల్‌ పర్యటనలో రాష్ట్రపతిని టీఎంసీ అవమానించింది. టీఎంసీ హద్దు మీరి ప్రవర్తిస్తోంది’ అని మోదీ అసంతృప్తి వ్యక్తం చేశారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)