Breaking News

గవర్నర్లను కీలుబొమ్మలుగా మార్చారు 

Published on Sun, 01/25/2026 - 04:50

హుబ్బళ్లి:  కాంగ్రెస్‌ పాలిత, బీజేపీయేతర పార్టీల పాలన ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లను కేంద్ర ప్రభుత్వ కీలుబొమ్మలుగా మార్చేసిందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను వేధించడానికి గవర్నర్లను ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. ప్రధానమంత్రి కార్యాలయం, కేంద్ర హోంశాఖ కార్యాలయాల ద్వారా కేంద్ర ప్రభుత్వం గవర్నర్లకు ఆదేశాలు ఇస్తోందని చెప్పారు. 

ముఖ్యమంత్రులు సిద్ధంచేసిన ప్రసంగాన్ని అసెంబ్లీలో చదవొద్దని చెబుతోందని పేర్కొన్నారు. కర్ణాటక, కేరళ, తమిళనాడులో ఇలాంటి ఉదంతాలు చోటుచేసుకున్నాయని వెల్లడించారు. బీజేపీయేతర పార్టీల పాలిత రాష్ట్రాల్లో గవర్నర్లు ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులకు సమ్మతి తెలియజేయకుండా వెనక్కి పంపిస్తున్నారని చెప్పా రు. ఈ విషయంలో పై స్థాయి నుంచి ఆదేశాలు అందుతున్నాయంటూ గవర్నర్లు కూడా ప్రైవేట్‌ సంభాషణల్లో చెబుతున్నారని తెలిపారు. రాబోయే అన్ని ఎన్నికల్లో బీజేపీని చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. లేకపోతే దేశంలో నిరంకుశ పాలన వస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. 
 

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)