అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!
Breaking News
పరీక్షల సంస్కరణలపై కేంద్రం కీలక నిర్ణయం
Published on Sun, 07/26/2026 - 19:20
ఢిల్లీ: పరీక్షల సంస్కరణలపై కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది. అక్రమాల నివారణే లక్ష్యంగా పలు సంస్కరణలు తీసుకురావడానికి కేంద్రం సన్నద్ధమైంది. పరీక్షల సంస్కరణలపై ఉన్నత స్థాయి టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసింది కేంద్రం. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు నరేంద్ర మోదీ. ‘ పరీక్షల సంస్కరణలపై ఉన్నతస్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశాం. సాంకేతిక నిపుణుడు నందన్ నీలేఖని నేతృత్వంలో హైపవర్డ్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశాం, పరీక్షల విశ్వసనీయతపై ఇచ్చే ఈ నివేదికను అమలు చేస్తాం.
లీక్లకు పాల్పడిన వారిని జైల్లో పెట్టాం. రేపు పార్లమెంట్లో కఠిన చట్టాలను తీసుకొస్తాం. పోటీ పరీక్షల నిర్వహణలో పారదర్శకతతో పాటు అక్రమాల నివారణే లక్ష్యం సంస్కరణలు తీసుకురాబోతున్నాం. విద్యార్థుల భవిష్యత్ కోసం నిరంతరం చర్యలు తీసుకుంటున్నాం. కఠిన నియమాలతో కొత్త చట్టం తీసుకొస్తున్నాం. వీలైనంత ఎక్కువగా టెక్నాలజీని ఉపయోగిస్తాం’ అని తెలిపారు.
HIGH POWERED TASK FORCE on examination reforms under the leadership of Shri Nandan Nilekani constituted.@NandanNilekani pic.twitter.com/mMpmPdIEL5
— Narendra Modi (@narendramodi) July 26, 2026
Tags : 1