Breaking News

ఎయిర్‌ ఫ్యూరిఫైయర్లపై జీఎస్టీ తగ్గింపు.. కేంద్రం స్పందన ఇదే..

Published on Fri, 12/26/2025 - 13:38

ఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీ సహా చుట్టుపక్కల పలు ప్రాంతాల్లో వాయు కాలుష్యం తీవ్రంగా ఉన్న వేళ.. ఎయిర్‌ ప్యూరిఫైయర్లపై 18 శాతం జీఎస్టీ కొనసాగిస్తుండటంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం తరఫున విచారణకు విచారణకు హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) వెంకటరమణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎయిర్‌ ప్యూరిఫైయర్లపై దాఖలైన పిల్‌ను వ్యతిరేకించారు. దీనిపై వివరణాత్మక అఫిడవిట్‌ దాఖలుకు సమయం ఇవ్వాలని కోరారు.

ఎయిర్‌ ఫ్యూరిఫైయర్లను వైద్య పరికరంగా పరిగణించి.. 5 శాతం జీఎస్టీ శ్లాబులోకి తీసుకొచ్చేలా ఆదేశాలివ్వాలని కోరుతూ ఢిల్లీ కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైన విషయం తెలిసిందే. న్యాయవాది కపిల్‌ మదన్‌ దాఖలు చేసిన ఈ పిటిషనుపై కేంద్రానికి హైకోర్టు నోటీసు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ వెంకటరమణ శుక్రవారం వాదనలు వినిపించారు. ఈ సందర్బంగా.. జీఎస్టీ రేట్లను సరైన ప్రక్రియ తర్వాత జీఎస్టీ కౌన్సిల్ మాత్రమే నిర్ణయించగలదు. అలాగే, ఈ పిటిషన్‌పై స్పందించడానికి రెండు రోజుల సమయం సరిపోదన్నారు.

ఈ విషయంపై వివరణాత్మక అఫిడవిట్ దాఖలు చేయడానికి పది రోజుల సమయం ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. జీఎస్టీ తగ్గింపునకు ఒక ప్రక్రియ ఉందని, ఈ ప్రక్రియను అడ్డుకోలేమని కోర్టుకు తెలిపారు. జీఎస్టీ కౌన్సిల్ ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ అని, ఇది సమాఖ్య పన్ను అని వివరించారు. ఈ ప్రక్రియలో అన్ని రాష్ట్రాలు పాలుపంచుకుంటాయని, ఏదైనా విషయంపై ఓటింగ్ జరగాలంటే అది భౌతికంగా మాత్రమే సాధ్యమవుతుందన్నారు. పార్లమెంటరీ కమిటీ మాకు కొన్ని సిఫార్సులు చేసింది. వాటిని పరిగణనలోకి తీసుకుంటాము. ఇందులో రాజ్యాంగపరమైన అంశం ముడిపడి ఉందని చెప్పుకొచ్చారు. దీంతో, తదుపరి విచారణను జనవరి 9వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. 

చనిపోతున్నా స్పందించరా?
అంతకుముందు.. దేశ రాజధాని నగరం ఢిల్లీ సహా చుట్టుపక్కల పలు ప్రాంతాల్లో వాయు కాలుష్యం తీవ్రంగా ఉన్న వేళ.. ఎయిర్‌ ప్యూరిఫైయర్లపై 18 శాతం జీఎస్టీ కొనసాగిస్తుండటంపై హైకోర్టు బుధవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ గాలి శుద్ధి యంత్రాలపై జీఎస్టీ తగ్గించే అంశాన్ని ఎందుకు పరిశీలించడం లేదని కేంద్రాన్ని ప్రశ్నిస్తూ.. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. జీఎస్టీ కౌన్సిలు తక్షణం సమావేశమై గాలిశుద్ధి యంత్రాలపై పన్ను తగ్గించడం లేదా పూర్తిగా రద్దు చేయడంపై ఓ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ‘‘మనం రోజుకు 21 వేల సార్లు శ్వాస తీసుకుంటాం. అలాంటప్పుడు గాలి కాలుష్యం వల్ల ఎంత నష్టం జరుగుతుందో ఓసారి లెక్కించండి’’ అని వ్యాఖ్యానించింది.  పిటిషనుపై స్పందించేందుకు గడువు ఇవ్వాలన్న ప్రభుత్వ అభ్యర్థనపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘వాయు కాలుష్యం ప్రాణాంతకంగా మారింది. వేల సంఖ్యలో ప్రజలు చనిపోయిన తర్వాత స్పందిస్తారా? ప్రతి పౌరుడికి స్వచ్ఛమైన గాలి అవసరం. అది అందించలేనప్పుడు కనీసం శుద్ధి యంత్రాలనైనా అందుబాటు ధరల్లో ఉంచాలి కదా! ఇలాంటి ఎయిర్‌ ఎమర్జెన్సీలో జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ) కింద తాత్కాలిక పన్ను మినహాయింపును తక్షణం ఎందుకు ఇవ్వకూడదు?’’ అని కేంద్రంపై ప్రశ్నలు కురిపించింది. ప్రజల ప్రాణాల కంటే పన్నులే ముఖ్యమా? అంటూ ప్రశ్నించింది.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)