Breaking News

బాంబు బెదిరింపులు: సోషల్‌మీడియా సంస్థలపై కేంద్రం ఆగ్రహం

Published on Wed, 10/23/2024 - 16:09

న్యూఢిల్లీ: దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులకు బాంబు బెదిరింపు హెచ్చరికలకు తెరపడటం లేదు. గతంలో ఎన్నడూ లేనివిధంగా కొద్దిరోజులుగా విమానయాన సంస్థలకు  వస్తున్న బాంబు బెదిరింపులు అందరినిషాక్‌ గురిచేస్తున్నాయి. దాదాపు 10 రోజుల్లో 170కి పైగా విమాన సర్వీసులకు హెచ్చరికలు వచ్చాయి. వీటిపై విమానయానశాఖ విచారణ చేపడుతున్ప్పటికీ, ఎయిర్‌లైన్స్‌ యాజమాన్యం తనిఖీలు చేస్తున్నా బెదిరింపులు మాత్రం ఆగం లేదు.

అయితే బెదిరింపులు ఎక్కువగా సామాజిక మాధ్యమాల ద్వారా వస్తుండటంతో తాజాగా కేంద్ర ఎలక్ట్రానిక్‌, ఐటీ మంత్రిత్వశాఖ.. సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ‘ఎక్స్‌’పై ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రిత్వశాఖ సంయుక్త కార్యద్శి సంకేత్‌ ఎస్‌ భోంద్వే.. విమానయానసంస్థ అధికారులు, ఎక్స్‌, మెటా వంటిఇ సోషల్‌ మీడియా ప్రతినిధితులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల పనితీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఎక్స్‌ వంటి మాధ్యమాల్లో వస్తున్న పుకార్లను నియంత్రించడంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.

కాగా గత కొన్ని రోజులుగా భారతీయ విమానయాన సంస్థలు నిర్వహిస్తున్న 120కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. నిన్న కూడా ఇండిగో, విస్తారా, ఎయిర్ ఇండియాకు చెందిన 30 విమానాలకు ఇలాంటి బెదిరింపులు అందాయి. అయితే అధికారులు అప్రమత్తమై భద్రతా ప్రోటోకాల్‌లను అనుసరించారు. 

ఈ పరిస్థితిపై పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ఇలాంటి బాంబు బెదిరింపులకు పాల్పడేవారిపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. ప్రయాణీకుల భద్రతపై రాజీ పడకుండా ప్రభుత్వం దీనిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. ఇలాంటి బూటకపు బెదిరింపులను ప్రసారం చేసే వారిపై నో ఫ్లై లిస్ట్‌తో సహా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. అదేవిధంగా ప్రస్తుత విమానయాన భద్రతా నిబంధనల సవరణకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.

ఇవి బూటకపు బెదిరింపులే అయినప్పటికీ వాటిని సీరియస్‌గా తీసుకోవాల్సి ఉంటుందని ఆయన ఉద్ఘాటించారు. బెదిరింపుల దాడి వెనుక కుట్ర దాగి ఉంటుందా అని ప్రశ్నించగా.. దీనిపై సమగ్ర విచారణ జరుగుతోందని మంత్రి చెప్పారు.ఇప్పుడే ఏ విషయం చెప్పలేమని, దర్యాప్తు పూర్తయ్యే వరకు వేచి ఉండాలని కోరారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)