Breaking News

అత్యంత భద్రతా ప్రమాణాలతో ఈ-పాస్‌పోర్ట్‌: కేంద్రం

Published on Wed, 11/19/2025 - 07:54

న్యూఢిల్లీ: నకిలీ, డూప్లికేట్‌ పాస్‌పోర్ట్‌ల తయారీకి అడ్డుకట్టవేయడంతోపాటు అదనపు ఫీచర్లు జోడిస్తూ అత్యున్నత భద్రతా ప్రమాణాలతో కొత్త తరం ఈ-పాస్‌పోర్ట్‌ను తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం వాటి జారీని వేగవంతం చేసింది. ఇప్పటికే 80 లక్షల ఈ-పాస్‌పోర్ట్‌ల జారీ పూర్తయిందని భారత విదేశాంగ శాఖ పేర్కొంది.

పాత పాస్‌పోర్ట్‌లు 2035 ఏడాది దాకా లేదంటే వాటి ఎక్స్‌పయిరీ తేదీ ఉన్నంత వరకు మనుగడలో ఉంటాయని పేర్కొంది. కరెన్సీ నోట్లపై అత్యంత సూక్ష్మంగా ముద్రించే అక్షరాలు, అత్యంత పల్చటి ఆకృతులు, థ్రెడ్‌ తరహాలో పాస్‌పోర్ట్‌ పేజీలను అధునాతన భద్రతా ప్రమాణాలతో తయారుచేసినట్లు భారత విదేశాంగ శాఖ మంగళవారం ప్రకటించింది. దేశ, విదేశాల్లోని పౌరుల కోసం పాస్‌పోర్ట్‌ సేవా ప్రోగ్రామ్‌(పీఎస్‌పీ వీ.2.0), గ్లోబల్‌ పాస్‌పోర్ట్‌ సేవా ప్రోగ్రామ్‌(జీపీఎస్‌పీ వీ.2.0), ఇ–పాస్‌పోర్ట్‌లు తీసుకురాబోతున్నట్లు విదేశాంగ శాఖ గతంలోనే ప్రకటించడం విదితమే.  

చిప్, యాంటెన్నాలతో పాస్‌పోర్ట్‌ 
కొత్త పాస్‌పోర్ట్‌ పేజీల పరంగా, ఎల్రక్టానిక్‌ అంశాల పరంగా అధునాతమైంది. పాస్‌పోర్ట్‌లో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌(ఆర్‌ఎఫ్‌ఐడీ) చిప్‌తోపాటు సూక్ష్మస్థాయి యాంటెన్నాను అమర్చారు. ఇవి ఆ పాస్‌పోర్ట్‌ ఉన్న వ్యక్తి సంబంధించిన డేటాను తనలో ఇముర్చుకుంటాయి. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థల ప్రమాణాలకు అనుగుణణంగా ఈ ఫీచర్లను జోడించారు. డేటా పేజీలో పోస్‌పార్ట్‌ ఉన్న వ్యక్తికి సంబంధించిన కీలక సమాచారం ఉంటుంది. దీంతో దీనిని ఫోర్జరీచేయడం అసాధ్యం.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)