Breaking News

నేడు బిహార్‌కు సీఈసీ బృందం 

Published on Sat, 10/04/2025 - 06:21

న్యూఢిల్లీ: బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల కమిషర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్, ఎన్నికల కమిషనర్లు వివేక్‌ జోషి, ఎస్‌ఎస్‌ సంధు శనివారం పట్నాకు వెళ్లనున్నారు. వీరు రెండు రోజులపాటు అక్కడి అధికారులతో సమావేశం నిర్వహించి సమీక్షిస్తారు. 243 సీట్లున్న రాష్ట్ర అసెంబ్లీ గడువు నవంబర్‌ 22న ముగియనుంది. అక్టోబర్‌ నెలాఖరులో పోలింగ్‌ ప్రారంభమై వచ్చే నెలలో పలు దశల్లో పోలింగ్‌ జరగనుంది.

 ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే ముందు ఈసీ ఆయా రాష్ట్రాల్లో పర్యటించడమనేది సాధారణంగా జరిగే ప్రక్రియ. ఇందులోభాగంగా ఈసీ రాజకీయ పారీ్టల ప్రతినిధులు, పాలనా సంబంధిత అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, రాష్ట్ర ఎన్నికల అధికారులతో సమావేశమవుతుంది. ఎన్నికల నిర్వహణ సిబ్బంది ఆయా చట్టాలు, నియమాలతో పూర్తి అవగాహనతో ఉండి పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించేలా ఈసీ సమాయత్తం చేస్తుంది.

 కేంద్ర పరిశీలకులు బరిలో నిలిచే అభ్యర్థులకు సమాన అవకాశాలు ఉండేలా నిర్ధారించుకుంటారు. రాజకీయ పారీ్టలు, అభ్యర్థులు, ఓటర్ల సమస్యలను తీర్చేందుకు పరిశీలకులు అందుబాటులో ఉండాల ని చెప్పారు. ఓటర్ల సౌలభ్యం కోసం ఈసీ తీసుకొ చ్చిన కార్యక్రమాలు సరిగా అమలవుతున్నాయో లేదో చూసేందుకు పరిశీలకులు పోలింగ్‌ బూత్‌ల ను సందర్శించాలని ఈసీ ఆదేశించింది. గత సెపె్టంబర్‌ 30న ప్రచురితమైన ఓటర్ల తుది జాబితా ప్రకారం 7.42 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.   


 

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)