మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?
Breaking News
CBSE: ఇక ఏడాదికి రెండుసార్లు పదో తరగతి పరీక్షలు
Published on Wed, 06/25/2025 - 17:00
సాక్షి,ఢిల్లీ: విద్యా వ్యవస్థలో కీలక మార్పులు చేసేందుకు కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ (ఎన్‌ఈపీ) భాగంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఏడాది నుంచి రెండుసార్లు (twice a year) పది పరీక్షలు నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఏడాదిలో రెండుసార్లు పదో తరగతి పరీక్షల నిర్వహణకు బోర్డు ఆమోదం తెలిపింది.
బోర్డు నిర్ణయంతో సీబీఎస్‌ఈ విధానంలో 10వ తరగతి (CBSE Class 10 board exams) చదివే విద్యార్థులు వచ్చే ఏడాది అంటే 2026 నుంచి బోర్డు పరీక్షలను ఏడాదిలో రెండుసార్లు రాయాల్సి ఉంటుంది. ఇందులో తొలి దఫా పరీక్షలు ఫిబ్రవరిలో రెండో విడత పరీక్షలు మేలో జరుగుతాయని సీబీఎస్‌ఈ కంట్రోలర్ సన్యాం భరద్వాజ్ తెలిపారు.
దీనికి అనుగుణంగా తొలి విడత పదో తరగతి పరీక్షలను బోర్డు తప్పనిసరి చేసింది. రెండో విడత పదో తరగతి పరీక్షలను ఆప్షనల్‌గా పెట్టింది. రెండు విడతల్లో మంచి స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది. రెండు దశలకు సంబంధించిన ఫలితాలు వరుసగా ఏప్రిల్, జూన్‌లో ప్రకటించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
సీబీఎస్‌ఈ (CBSE) తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం, విద్యార్థులు సైన్స్, మ్యాథ్స్, సోషల్ సైన్స్, లాంగ్వేజ్ సబ్జెక్ట్స్‌లలో ఏదైనా మూడు విభాగాలలో తక్కువ మార్కులు వచ్చినా, వారు మళ్లీ పరీక్ష రాసుకునే అవకాశం కల్పించారు. తద్వారా విద్యార్థులకు ఒత్తిడి తగ్గించి, వారి అసలు సామర్థ్యాన్ని మెరుగ్గా చూపించేందుకు సహాయ పడనుట్లు తెలిపారు.
Tags : 1