ట్విషా శర్మ కేసు: సీబీఐకి సహకరించని అత్త, భర్త

Published on Wed, 07/15/2026 - 12:11

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో సంచలనం సృష్టించిన ట్విషా శర్మ మృతి కేసులో దర్యాప్తు వేగవంతమైంది. కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐకి సహకరించకపోవడంతో, మాజీ జిల్లా జడ్జి గిరిబాల సింగ్, ఆమె కుమారుడు సమర్థ్ సింగ్‌ల జ్యుడీషియల్ కస్టడీని భోపాల్ కోర్టు మరో 14 రోజుల పాటు పొడిగించింది. నిందితులు వాయిస్ శాంపిల్స్ ఇచ్చేందుకు నిరాకరించడమే కాకుండా, దర్యాప్తునకు పూర్తిస్థాయిలో సహకరించడం లేదని సీబీఐ కోర్టుకు తెలిపింది.

గతంలోనే నిందితుల నుంచి వాయిస్ శాంపిల్స్ సేకరించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే, జైలులో అధికారులు శాంపిల్స్ కోసం ప్రయత్నించగా, సమర్థ్ సింగ్ నిరాకరించారని, గిరిబాల సింగ్ కేవలం పాక్షికంగా మాత్రమే సహకరించారని సీబీఐ పేర్కొంది. డిజిటల్ సాక్ష్యాల ఫోరెన్సిక్ విశ్లేషణ, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నివేదికలు రావాల్సి ఉందని, పలువురు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయాల్సి ఉందని దర్యాప్తు సంస్థ తెలిపింది.

ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, జూలై 28 వరకు వారి కస్టడీని పొడిగిస్తూ, మరోసారి వాయిస్ శాంపిల్స్ సేకరించాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. కాగా మే 12న భోపాల్‌లోని కతారా హిల్స్ నివాసంలో ట్విషా శర్మ మృతి చెందారు. ఇది ఆత్మహత్య అని అత్తమామలు వాదిస్తుండగా, ఆమెది హత్యేనని త్విష కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)