Breaking News

భార్యకు అస్వస్థత, కొడుకు విదేశాల్లో ఉన్నాడు!ఐనా సిసోడియాకు నో బెయిల్‌

Published on Tue, 03/21/2023 - 17:51

లిక్కర్‌ స్కాంలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్‌ సీసోడియా బెయిల్‌ మంజూరు చేయాల్సిందిగా మరోసారి ఢిల్లీ కోర్టుని అభ్యర్థించారు. ఈ మేరకు ఆయన తరుఫు లాయర్‌ సిసోడియా భార్యకు అస్వస్థతని, కొడుకు విదేశాల్లో ఉన్నాడని అందువల్ల ఆయనే తన భార్యను చూసుకోవాల్సి ఉందని కోర్టుకి తెలిపారు. ఫిబ్రవరి 26న సిసోడియాను అరెస్టు చేసిన సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ అతని బెయిల్‌ని వ్యతిరేకిస్తూ వస్తోంది. అతను ప్రభుత్వంలో అత్యున్నత పదవిలో ఉన్నాడని కేసుకు సంబంధించిన సాక్ష్యాలను ప్రభావితం చేయగలడంటూ బెయిల్‌ నిరాకరించింది సీబీఐ.

ఐతే సిసోడియా సీబీఐ దర్యాప్తుకు తాను సహకరిస్తానని, సోదాల్లో తనకు వ్యతిరేకంగా ఎలాంటి నేరారోపణలు లేవని సిసోడియా తరుఫు లాయర్‌ వాదించారు. ఇకపై అతనికి కస్టడీ అవసరం లేదని ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆయన తరుఫు న్యాయవాది చెప్పారు. కానీ సీబీఐ మాత్రం సాక్షులను ప్రభావితం చేయగలడని, దర్యాప్తును అడ్డుకోగలడని వాదిస్తోంది. ఐతే సిసోడియ న్యాయవాది మాత్రం ఆయనపై ఆరోపించిన నేరాలకు ఏడేళ్ల కంటే తక్కువ జైలు శిక్షే పడుతుందని, ఇకపై ఎలాంటి జైలు శిక్ష విధించడం సమర్థనీయం కాదని కోర్టుకి విన్నవించారు.

సిసోడియా 18 పోర్ట్‌ఫోలియాలను కలిగి ఉన్నాడని, అతను ఉపయోగించిన ఫోన్‌లు, కీలకమైన ఫైళ్లను అతను ధ్వంసం చేశాడని, ఇదేమి తెలిసీ తెలియకుండా చేసిన పని కాదని ఉద్దేశపూర్వకంగా చేసిందేనని నొక్కి చెబుతోంది సీబీఐ. అలాగే ఈ కేసులో ఛార్జిషీట్‌ దాఖలు చేయడానికి సీబీఐకు 60 రోజులు సమయం పడుతుందని, ఆయన బయటకు వస్తే దర్యాప్తు పక్కదోవ పట్టే ప్రమాదం ఉందని పేర్కొంది. 

(చదవండి: మనీష్‌ సిసోడియాకు మరోసారి చుక్కెదురు..బెయిల్‌ విచారణ వాయిదా..)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)