Breaking News

NEET Paper Leak: ఒక్కో పేపర్‌ రూ. 60 లక్షలు..150 మంది కొనుగోలు

Published on Thu, 07/25/2024 - 10:40

పట్నా: నీట్ యూజీ 2024 పేపర్ లీక్ కేసులో సీబీఐ దర్యాప్తులో కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. తాజాగా సీబీఐకి అందిన సమాచారం ప్రకారం  విద్యార్థులు నీట్ ప్రశ్నపత్రాలను రూ.35 నుంచి 60 లక్షలకు కొనుగోలు చేశారు. నిందితులు ఈ పేపర్లను బీహార్ విద్యార్థులకు రూ.35 నుంచి 45 లక్షలకు విక్రయించగా, బీహార్ వెలుపలి విద్యార్థులకు రూ.55 నుంచి 60 లక్షలకు విక్రయించారు. విచారణలో 150 మందికి పైగా విద్యార్థులు పేపర్లు కొనుగోలు చేసినట్లు ఆధారాలు లభించాయి.

గుజరాత్‌లోని గోద్రా, మహారాష్ట్రలోని లాతూర్, హజారీబాగ్, పట్నా ఇతర నగరాల్లోని వివిధ ప్రాంతాలలో ఈ విక్రయాలు జరిగినట్లు సీబీఐ దర్యాప్తు నివేదికలో వెల్లడైంది. పట్నాలోని 35 మంది విద్యార్థులకు సమాధానాలతో కూడిన ప్రశ్నా పత్రాలను అందించారని సీబీఐ తన దర్యాప్తు నివేదికలో పేర్కొంది. అయితే ప్రశ్నాపత్రాలు కొనుగోలు చేసిన 150 మంది విద్యార్థుల్లో సగం మంది మెరుగైన మార్కులు సాధించలేదని తెలుస్తోంది.

దర్యాప్తులో ఎన్‌టీఏ పలువురు అనుమానిత విద్యార్థుల పేర్లను ఆర్థిక నేరాల విభాగానికి పంపింది. ఈఓయూ  ఆ విద్యార్థులను విచారించింది. మరోవైపు నీట్ పేపర్ లీక్ కేసులో ధన్‌బాద్‌లో అరెస్టయిన అవినాష్ కుమార్ అలియాస్ బంటీని ఆరు రోజుల పోలీసు రిమాండ్‌పై సీబీఐకి అప్పగించాలని పట్నా ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ఇతనిని జూలై 30 వరకు సీబీఐ విచారించనుంది.

#

Tags : 1

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)