Breaking News

ఆర్‌జీ కర్‌ ఆస్పత్రిలో అవినీతి.. సీబీఐ ఛార్జ్‌షీట్‌ దాఖలు

Published on Sat, 11/30/2024 - 07:56

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో గల ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీకి సంబంధించిన అవినీతి కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ను ప్రధాన నిందితునిగా పేర్కొంటూ సీబీఐ ఆ ఛార్జ్ షీట్‌లో పేర్కొంది. 1000 పేజీల చార్జిషీటును సీబీఐ సిద్ధం చేసింది. అయితే  ఈ ఛార్జ్‌షీట్‌ను అంగీకరించేందుకు కోర్టు నిరాకరించింది. ఈ చార్జిషీటులో ఐదుగురిని నిందితుల జాబితాలో చేర్చారు.

సీబీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ (సస్పెండ్ అయ్యారు)తో పాటు మరో నలుగురు అరెస్టయిన నిందితుల పేర్లు ఛార్జ్ షీట్‌లో ఉన్నాయన్నారు. ఇందులో బిప్లబ్ సింగ్, అఫ్సర్ అలీ, సుమన్ హజ్రా, ఆశిష్ పాండే పేర్లు ఉన్నాయి. అయితే, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిపై చార్జిషీట్ దాఖలు చేయడానికి అవసరమైన అధికారిక అనుమతి పొందలేనందున అలీపూర్‌లోని ప్రత్యేక సీబీఐ కోర్టు ఈ ఛార్జిషీట్‌ను అంగీకరించలేదు.

ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో విద్యార్థినిపై అత్యాచారం, హత్య కేసు దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఇదే సమయంలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో భారీ అవినీతి జరిగిందంటూ విద్యార్థులు, కొంతమంది వైద్యులు ఆరోపించారు. మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌పై కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ నేపధ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దీనిపై దర్యాప్తు చేయడానికి సిట్‌ను ఏర్పాటు చేసింది. విచారణలో పలు ఆర్థిక అవకతవకలు బయటపడ్డాయి. వైద్యసామగ్రి కొనుగోలులో నిందితులు  అవినీతికి పాల్పడ్డారని సీబీఐ విచారణలో తేలింది. 

ఇది కూడా చదవండి: కొనసాగుతున్న షియా-సున్నీల హింసాకాండ.. 122 మంది మృతి

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)